NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజలకు మెరుగైన వైద్యమే లక్ష్యం

1 min read

ఆరోగ్య కేంద్రానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే..

నందికొట్కూరు న్యూస్ నేడు : పట్టణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ముఖ్య ఉద్దేశమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోనిబైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నగర్ లో సోమవారం ఉదయం పట్టణ నూతన ఆరోగ్య కేంద్రానికి ఎమ్మెల్యే భూమి పూజ చేసి ప్రారంభించారు.ఒక కోటి రూపాయల నిధులతో నిర్మిస్తున్న నూతన పట్టణ ఆరోగ్య భవన నిర్మాణానికిప్రత్యేకంగా పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నామని అన్నారు.ఈ నిర్మాణ పనులు నాణ్యతగా ఉండాలని త్వరగా పనులు పూర్తి చేసే విధంగా చూడాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.తర్వాత పాములపాడు మండలం భానుముక్కల గ్రామంలో మరియు పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామాల్లో ‘మీ భూమి-మీ హక్కు’ అనే కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.క్యూ ఆర్ కోడ్ తో ప్రభుత్వం రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి,మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,ఎంపీడీవో సుమిత్రమ్మ, తహసిల్దార్,పట్టణ అసిస్టెంట్ ఇంజనీర్ దినేష్ కుమార్, మహేశ్వర్ రెడ్డి,కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author