NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పత్తికొండలో ఘనంగా బిజేపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

1 min read

న్యూస్ నేడు,  పత్తికొండ: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బిజెపి పత్తికొండ మండల అధ్యక్షులు కరణం నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. “మన ఊరు – మన జెండా” పేరుతో సోమవారం స్థానిక తేర్ బజార్, సుంకం గేట్ ప్రాంతాల్లో బిజెపి జెండా ఆవిష్కరణ గావించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు  దండి మల్లికార్జున, స్టేట్ కౌన్సిల్ సభ్యులు పూనా మల్లికార్జున, లీగల్ సెల్ కన్వీనర్ తంబల నాగేష్ ల చేతులు మీదుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండా మరియు పార్టీ జెండాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ, 1980 ఏప్రిల్ 6న స్థాపించబడిన భారతీయ జనతా పార్టీ నేడు 47 సంవత్సరాల సేవా యాత్రలో దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందని తెలిపారు. “దేశం ముందు – పార్టీ తర్వాత – వ్యక్తి చివర” అనే సిద్ధాంతంతో కార్యకర్తలు, నాయకులు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.అలాగే భారత్‌ను బలమైన, ఐక్యమైన, అభివృద్ధి చెందిన “వికసిత భారత్”గా తీర్చిదిద్దేందుకు ప్రతి కార్యకర్త కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి బ్రహ్మయ్య. ఓబిసి మోర్చ జిల్లా కార్యదర్శిమోర్చ రామాంజనేయులు. కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి సిసి రంగన్న. కిషోర్ మండల ప్రధాన కార్యదర్శి మాలేఖరి వీరేష్. కార్యదర్శి పందుకోన గోపాల్. ఎస్టి మోర్చా మండల అధ్యక్షులు హరీష్ నాయక్ ఓబీసీ మోర్చ మండల అధ్యక్షులు రవీంద్ర. కర్ణం చంద్రన్న కరణం శ్రీరాములు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *