NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

న్యాయం చేయకపోతే..ఆత్మహత్యలే శరణ్యం

1 min read

శ్రీశైలం ముంపు బాధితుల రిలే నిరాహార దీక్షలు..

నందికొట్కూరు న్యూస్ నేడు: మాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని శ్రీశైలం ముంపు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని పటేల్ సెంటర్ లో మంగళవారం ముంపు బాధితులు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. బాధితులు కేజీ రోడ్డుపై ప్లేట్లను చేత పట్టుకొని మోకాళ్లపై నిలుచుని నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా శ్రీశైలం ముంపు బాధితులు జయన్న,రాజారామ్ మాట్లాడుతూ శ్రీశైలం బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణానికి గాను ఇండ్లు పొలాలు సర్వం కోల్పోయామని శ్రీశైలం ముంపు బాధితుల మొరను ఆలకించిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు బాధితులకు ఉద్యోగాలు ఇస్తామని జీవో 98 ని అమలు చేశారని అన్నారు.ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు 2017,2019,2024 లో హామీ ఇచ్చారని పవన్ కళ్యాణ్ 2019లో మరియు నారా లోకేష్ యువగళం పాదయాత్ర నందికొట్కూరులో హామీ ఇచ్చారని అన్నారు.కానీ ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయినా కూడా మా గోడును పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. కానీ అప్పటినుండి ఇప్పటి వరకు శ్రీశైలం ముంపు బాధితులకు మాత్రం న్యాయం జరగలేదని జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ముంపు పరిసర ప్రాంతాలైన పగిడ్యాల, కొత్తపల్లి,పాములపాడు, మిడుతూరు మండలాల్లో దాదాపుగా 44 గ్రామాల ప్రజలు ఈ ప్రాజెక్టుకు పొలాలను ఇచ్చారని ముఖ్యమంత్రికి మూడుసార్లు అర్జీలు ఇచ్చాం గడువుతో కూడిన 90 రోజుల గడువుతో ఎండార్స్ మెంట్ ఇచ్చారని 205 లస్కర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిలో ఈ 674 జాబితాను రీప్లేస్ మెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.మా సమస్యను పరిష్కరించే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ముంపు బాధితులు రవి అయ్యా, వెంకటేశ్వర్లు,జమ్మన్న, నారాయణ,వెంకటేశులు, శైలజ,కిరణ్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *