సబ్ ఇన్ స్పెక్టర్ పదోన్నతికి కొనసాగుతున్న ఎంపిక పరీక్షలు
1 min read

జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించిన…
ఐజీ / అనంతపురం రేంజ్ ఇంచార్జి డీఐజీ డాక్టర్ షెముషి ఐపిఎస్
కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్
కర్నూలు ఎపిఎస్పీ రెండవ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు మండలం, దిన్నదేవరపాడు దగ్గర ఉన్న జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో కొనసాగుతున్న సబ్ ఇన్ స్పెక్టర్ పదోన్నతి ఎంపిక పరీక్షలను బుధవారం ఐజీ / అనంతపురం రేంజ్ ఇంచార్జి డీఐజీ డాక్టర్ షెముషి ఐపిఎస్ , కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ , కర్నూలు ఎపిఎస్పీ రెండవ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్ లు పరిశీలించారు. రాయలసీమ జోన్ పరిధిలోని ఎఎస్సైలు మొత్తం 72 మంది ఈ ఎస్సై పదోన్నతి కి బుధవారం ఔట్ డోర్ పరీక్షలు నిర్వహించారు.డ్రిల్లు, ఆయుధాల పై పరిజ్ఞానం , నేర స్ధల పరిశీలన, మౌఖిక పరీక్ష(ఓరల్ టెస్ట్) తదితర అంశాలపై పరీక్షలు నిర్వహించారు. మంగళ వారం ఇండోర్ పరీక్షలు నిర్వహించారు.ఈ పరీక్షల నిర్వహణకు డిటిసి ప్రిన్సిపల్ శ్రీ హుస్సేన్ పీరా , డిటిసి వైస్ ప్రిన్సిపల్ శ్రీ దుర్గాప్రసాద్ భద్రత , నిర్వహణ ఏర్పాట్లు చేపట్టారు. ఆయా పరీక్షలలో ప్రతిభ కనబరచిన వారికి సబ్ ఇన్ స్పెక్టర్ లుగా పదోన్నతులు కల్పిస్తారు. ఈ పరీక్షల నిర్వహణ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ / డిటిసి ప్రిన్సిపాల్ శ్రీ హుస్సేన్ పీరా , కర్నూలు డిటిసి డిఎస్పీ / వైస్ ప్రిన్సిపాల్ దుర్గప్రసాద్ , డిఎస్పీ లు శ్రీనివాసులు, కరీం , సూర్యనారాయణ రెడ్డి, పోలీసు వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి , నన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ నందిని, కర్నూలు రేంజ్ డిఐజి మేనేజర్ రత్నప్రకాష్, సిఐలు , ఎస్సై లు , డిఐజి ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు.

