తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
1 min read

ప్రజలకు అందించే సేవలు వేగంగా ఉండాలి
డ్రైనేజీ,మురుగుపై కలెక్టర్ అసహనం..
మిడుతూరు న్యూస్ నేడు:ప్రజలకు అందించే వివిధ సేవలు పారదర్శకంగా వేగంగా ఉండాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల తహసిల్దార్ కార్యాలయాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.రీ-సర్వే పనులపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులను త్వరితగతినపరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచాలని రికార్డులనిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.ప్రజలకు అందుతున్న సేవలపై కలెక్టర్ క్షుణ్ణంగా రికార్డులను పరిశీలించారు.ఈ సందర్భంగా రీ-సర్వే ప్రక్రియపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్ ఫేజ్-3,ఫేజ్-4 కింద ఎన్ని గ్రామాల్లో సర్వే పూర్తయిందని అధికారులను అడిగారు. రీ-సర్వే పనులు నిర్ణీత కాల వ్యవధిలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల ఫిర్యాదులపై నిర్లక్ష్యంగా ఉండకుండా వెంటనే సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి పరిష్కరించాలని కార్యాలయ పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.తర్వాత గ్రామంలో రోడ్లు,డ్రైనేజీలు సరిగా లేవని ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా స్వయంగా కలెక్టర్ వెళ్లి రోడ్లను డ్రైనేజీ కాల్వలను కలెక్టర్ పరిశీలించి అసహనం వ్యక్తం చేశారు.పంచాయతీరాజ్ శాఖ ద్వారా రోడ్లు,డ్రైనేజీ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఎక్కడైనా సరే ప్రభుత్వ భూమిని అమ్మినట్లయితే ఆ భూమిని రద్దు చేయుటకు ప్రభుత్వం కలెక్టర్లకు అనుమతి ఇచ్చిందని జిల్లాలో రీ-సర్వేలో జరిగిన పొరపాట్లను 1780 ఫైళ్లను పరిష్కరించామని కలెక్టర్ అన్నారు.మండలంలో ఎక్కువగా మ్యూటేషన్ తదితర సమస్యలు అధికంగా ఉన్నాయని కలెక్టర్ అన్నారు. పలు సమస్యల పట్ల పాత్రికేయులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.ఇక్కడ వచ్చిన సమస్యలపై పూర్తిగా విచారణ చేయించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు.ఉ 11:30 నుండి మ 2:30 వరకు కలెక్టర్ మండల కేంద్రంలో ఉన్నారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాసులు,మండల డిప్యూటీ సర్వేయర్ కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.


