NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇన్ఫోసిస్ ప్రాంగణ ఎంపిక లో  సత్తా చాటిన ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు

1 min read

అభినందించిన కళాశాల ప్రిన్సిపల్ వంగ వెంకటేశ్వరరావు

మల్టీ నేషనల్ కంపెనీలలో ఉద్యోగాలు కల్పించడo కేవలం ఆదిత్యకే సాధ్యం

న్యూస్ నేడు,ఏలూరు జిల్లా ప్రతినిధి: ప్రముఖ కంపెనీ ఇన్ఫోసిస్ నిర్వహించిన ప్రాంగణ ఎంపికలో ఆదిత్య డిగ్రీ కళాశాల, సత్రంపాడు, ఏలూరులో చదువుచున్న 12 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ఆదిత్య కళాశాల ప్రిన్సిపాల్ వంగా వెంకటేశ్వరరావు తెలిపారు. డిగ్రీ అర్హతతో ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు 2,20,000 రూపాయల వార్షిక వేతనం లభిస్తుందని ఇన్ఫోసిస్ కంపెనీ హెచ్ ఆర్ ప్రతినిథి తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కంపెనీ ఏదైనా ఉద్యోగ సాధనలో ఆదిత్య విద్యార్థులు ముందుంటారని, డిగ్రీ ప్రధమ సంవత్సరం నుండి విద్యార్థులకు క్యాంపస్ రిక్రూట్మెంట్, సాప్ట్స్కల్స్లలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, డిగ్రీ కళాశాల చరిత్రలో ఎక్కాడలేని విధంగా విద్యార్థులకు మల్టినేషనల్ కంపెనీలలో ఉద్యోగాలు కల్పించడం కేలవం ఆదిత్య కే సాధ్యమని అన్నారు. ‘ఉద్యోగం కావాలంటే ఆదిత్య’ అనే విద్యార్థుల తల్లిదండ్రుల కలలను నెరవేరుస్తూ ఆదిత్య డిగ్రీ కళాశాలలు ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఈ సంవత్సరంలో రానున్న ఎంపికలలో విద్యార్థులు మరిన్ని మల్టినేషనల్ కంపెనీలలో సాప్ట్వేర్ ఉద్యాగాలు సాధించాలని శ్రీ వంగా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన 12 మంది 1) ఈషీ తసాయి బెజవాడ,యస్వంత్ కుమార్ చలంశెట్టి,పూజిత పోలుకొండ,శృతి దేవి కురకిర్, ప్రశ్రాoతి పెనుముడి,సత్యయమున వినుకొండ,లావణ్య తేజస్వని ఇందన, జాహ్నవిభూపాల, కావ్య ఆత్రగడ్డ, విద్యార్థులను ఆదిత్య విద్యాసంస్థల ఛైర్మన్ డా॥ నల్లమిల్లి శేషారెడ్డి, సెక్రటరి డా: నలమిల్లి సుగుణా రెడ్డి, అకడమిక్ డైరెక్టర్ డా: బి.ఇ.వి.యల్. నాయుడు మరియు నందన, నాగశ్రవంతి మేక,సిప్పొర గుళ్లపల్లి,దుర్గ అధ్యాపక, ఆధ్యాపకేతర బృందం అభినందించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *