NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆదర్శ కమ్యూనిస్టు చండ్ర…

1 min read

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆదర్శ కమ్యూనిస్టు చండ్ర రాజేశ్వరరావు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం చండ్ర రాజేశ్వరరావు 32వ వర్ధంతి కార్యక్రమం సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో  జరిగింది.చండ్ర రాజేశ్వరరావు చిత్రపటానికి డేగా  ప్రభాకర్, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా డేగా ప్రభాకర్ మాట్లాడుతూ బాల్యంలోనే విద్యార్థి సంఘానికి నేతృత్వం వహిస్తూ పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఆయన సొంతం అన్నారు.సిపిఐ, కార్మిక సంఘాలకు నాయకులుగా అనేక పోరాటాలు నిర్వహించి జాతీయ ప్రధాన కార్యదర్శిగా 28 సంవత్సరాలు పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేశారని కొనియాడారు. భూ సమస్యని ప్రభుత్వం ప్రజల అజెండాగా తీసుకువచ్చి దున్నేవానికి భూమి అనే నినాదంతో ప్రజలను చైతన్య పరచి భూ పోరాటానికి నాంది పలికారని తెలిపారు. ఆయనఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సిపిఐ,వ్యవసాయ కార్మిక సంఘం,తో పాటు ఇతర ప్రజా సంఘాలు బలోపేతానికి సిపిఐ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వర్ధంతి కార్యక్రమానికి సిపిఐ ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెళ్ళ వరప్రసాద్ అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి .శివకుమార్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు భజంత్రీ శ్రీనివాస్, ఏలూరు ఏరియా కార్యవర్గ సభ్యులు గొర్లి స్వాతి,కొల్లూరి సుధారాణి, సభ్యులు బళ్ల  కనకదుర్గారావు, కొండేటి రాంబాబు, ఉప్పులూరి లక్ష్మి, భవాని, నాగం అచ్యుత్, కనకం జగన్మోహనరావు, యర్రా వెంకటేశ్వర్లు,గేదెల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *