ఏలూరులో అత్యా ధునిక హంగులతో నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ భవనం
1 min read

ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగల పూడి అనిత
ఏలూరుజిల్లా ప్రతినిధి: మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత నిస్తూ, భవిష్యత్ అవసరాలకు అను గుణంగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యా లయ ప్రాంగణం నకు అతి సమీపములో నిర్మించిన నూతన మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి వంగల పూడి అనిత ఆమినాపేట లో గురువారం ప్రారంభించారు.సుమారు 30 సెంట్ల విస్తీర్ణంలో, 2 కోట్ల 73 లక్షల రూపాయల భారీ వ్యయంతో అన్ని రకాల హంగులతో ఈ రెండం తస్తుల భవనాన్ని నిర్మించారు.భవనము లో శిశు సంరక్షణ కేంద్రం స్టేషన్ కు వచ్చే మహిళలతో పాటు వారి చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా ‘చిల్డ్రన్స్ ప్లే ఏరియా’మరియు అవసరమైన సదుపాయాలను కల్పించడం ఈ భవనం యొక్క ప్రత్యేకత అన్నారు. ఆధునిక వసతులు మహిళా మరియు పురుష సిబ్బంది కోసం విడివిడిగా అత్యా ధునిక బేరాకులు.విశాలమైన కాన్ఫరెన్స్ హాల్ మరియు సమావేశ మందిరాలు.సురక్షితమైన లాకప్ గదులు మరియు సందర్శకుల కోసం వెయిటింగ్ హాల్.సాంకేతికత భావితరాల అవసరాలకు తగ్గట్టు గా, పూర్తి స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేలా నెట్‌వర్కింగ్ మరియు డిజిటల్ సదుపాయా లను ఇక్కడ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ ఈ రోజు పెదపాడు ను ప్రారంభిం చినట్లు ముందుగా నిర్వ హించిన పోలీస్ స్టేషన్ యొక్క స్థితి గతులను చూసి తాను ఎంతో ఆవేదన చెంది నట్లు అటువంటి వసతులు లేనటువంటి ప్రాంతంలో ఉద్యోగ నిర్వహణ చేసినటు వంటి ఆ పోలీస్ స్టేషన్ అధికారులను అభినందించినారు.మహిళలు తమ సమస్యలను నిర్భయంగా చెప్పుకునేలా, వారికి స్నేహ పూర్వక వాతావరణం కల్పించడమే, మహిళలకు ఏదైనా కష్టం సంభవించిన యెడల పుట్టింటికి వెళ్లి ఏ విధముగా వారి యొక్క సమస్యలను తెలియ చేసుకుంటారో అదే విధమైనటు వంటి అదే విధముగా మహిళా పోలీస్ స్టేషన్ కి మహిళలు వచ్చి వారి బాధలను తెలియచేసుకునేలాగా ఈ నూతన భవన లక్ష్యమని పేర్కొన్నారు.ఏలూరు జిల్లాలో ఫైలెట్ ప్రాజెక్టుగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఏలూరు జిల్లాని ఎంపిక చేయడం జరిగిందని నేర నియంత్రణ కొరకు ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తున్నారని అభినందించినారు.ఈ కార్యక్రమంలో మంత్రి తోపాటుగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ గంట పద్మ శ్రీ ప్రసాద్, ఏలూరు మున్సిపల్ చైర్మన్ నూర్జహాన్ పెదబాబు, ఏలూరు రేంజ్ ఐజి జి వి జి అశోక్ కుమార్ ఐపీఎస్, ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రీ సెల్వి ఐఏఎస్, జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, ఐ.పి.ఎస్. ట్రైనీ ఐపీఎస్ జయ శర్మ, జంగారెడ్డిగూడెం ఏ ఎస్ పి సుష్మిత ఆర్ ఐ పీ ఎస్, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ యు రవి చంద్ర, ఇతర ప్రజా ప్రతినిధులు మరియు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నూతన భవనాన్ని పరిశీలించిన అనంతరం హోం మంత్రి పోలీసుల పనితీరును అభినందించారు.అనంతరం ఏలూరు ట్రాఫిక్ క్రాస్ రోడ్ పార్కును మంత్రివర్యులు సందర్శిం చినారు సదరు పార్కులో విద్యార్థినీ విద్యార్థులకు చిన్నతనం నుంచే ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కల్పించే విధంగా ఏర్పాటు చేయించిన జిల్లా ఎస్పీ ని మంత్రి అనిత అభినందించినారు.


