NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రాంతాలకు అతీతంగా ఆర్యవైశ్యులు అందరూ కలిసికట్టుగా ఉండాలి

1 min read

– మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్

కర్నూలు, న్యూస్​ నేడు: ప్రపంచంలో ఉన్న ఆర్యవైశ్యులందరూ ప్రాంతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాలని మాజీ రాజ్యసభ సభ్యులు బిజెపి వెంకటేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన అమరవాది లక్ష్మీనారాయణ ఈరోజు టీజీ స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నూతన అధ్యక్షులుగా ఎన్నికైన అమరవాది లక్ష్మీనారాయణ, ఇల్లూరు లక్ష్మయ్య లను టీజీ వెంకటేష్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు వేరైనప్పటికీ ఆర్యవైశ్యులంతా ఒకటేనని అన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 45 మంది ఆర్యవైశ్య  ఎంపీలను ఏకతాటిపై తెచ్చి ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేసినట్టు తెలిపారు. ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉన్నప్పుడే సమస్యల పరిష్కారానికి సులువైన మార్గాలు లభిస్తాయిని టీజీ వెంకటేష్ తెలిపారు. ఆర్యవైశ్యులకు ఎటువంటి సమస్యలు వచ్చినా తాను ముందుండి సహాయ సహకారాలు అందిస్తానని టీజీ తెలిపారు. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ నూతనంగా నిర్మించ తలపెట్టిన భవన సముదాయలకు తన వంతుగా సహకారం అందిస్తానని టీజీ వెంకటేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ నాయకులు ఇరుకుల రామకృష్ణ, శంషాబాద్ గణేష్, శ్రీనివాస్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *