NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రి టి.జీ. భరత్  సారధ్యంలో ఉచిత మెగా వైద్య శిభిరం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖా మంత్రివర్యులు  టీ.జీ.భరత్ గుప్తా  సారధ్యంలో గౌరి గోపాల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశంపార్టీ కార్యకర్త లకు ఈ రోజు ఉచిత మెగా వైద్యశిభిరం కర్నూలు నగరంలోని గౌరి గోపాల్ హాస్పిటల్ నందు ఏర్పాటు వేయడం జరిగింది.ఈ శిభిరానికి తెలుగుదేశంపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా తెలుగుదేశంపార్టీ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్ లు ముఖ్యులుగా హాజరై ప్రారంభించడం జరిగింది.తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు తమ యొక్క తెలుగుదేశంపార్టీ సభ్యత్వం కార్డు తీసుకొని వచ్చి ఈ శిభిరం నందు ఉచితంగా ఆర్.బి.ఎస్, ఈ.సి.జి, 2 డి ఎకో, టీ.ఎం.టి, ఫైబ్రో స్కాన్ మరియు కంటి పరీక్షలను వేయించుకోవడం జరిగింది.ఈ సంధర్బంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నాగరాజు యాదవ్ లు మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తల ఆరోగ్య పరిరక్షణ కోసం శ్రీ టీ.జీ.భరత్  ఉచిత వైద్య శిభిరమును ఏర్పాటు వేయించడం జరిగిందని, ప్రజలకు సేవా చేయాలన్న, ధానం చేయాలన్న అది కేవలం టీ.జీ. కుటుంబానికే చెల్లిందని అన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం అత్యంత అవసరమని, ఉచిత వైద్య శిభిరాలు ఎంతో ఉప యోగకరంగా ఉంటాయని అన్నారు. నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ ఉచిత మెగా వైద్య శిభిరాన్ని సద్వినియోగం చేసుకోవడం సంతోషకరమని అన్నారు.భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను టీ.జీ.భరత్ గుప్తా  కొనసాగి స్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశంపార్టీ నాయకులు శ్రీయుతులు కొరకంచి రవికుమార్, సోమిశెట్టి శ్రీకాంత్, రాజశేఖర రెడ్డి, సోమిశెట్టి నవీన్, కైప పద్మలతారెడ్డి, అక్షయకుమారి, రాజ్యలక్ష్మి, రామాంజనే యులు, గట్టు తిలక్ మొదలగు వారితో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *