NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

1 min read

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యస్.కె.హబీబ్ భాషా

ఏలూరుజిల్లాప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక ఐఏడీపీ హాలులో గురువారం ప్రకృతి వ్యవసాయ అమలుపై విస్తృత స్థాయీ శిక్షణ కార్యక్రమం ఘనంగా  నిర్వహించామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యస్.కె.హబీబ్ భాషా తెలిపారు. లింగపాలెం, నిడమర్రు, టి.నర్సాపురం, చింతలపూడి, పెదపాడు, నూజివీడు, జంగారెడ్డిగూడెం, పెదవేగి, వేలేరుపాడు వివిధ మండలాలు నుండి సుమారు 120 మంది కేడరు సభ్యులు ఈ శిక్షణలో పాల్గొన్నారని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి యస్.కె. హబీబ్ బాషా మరియు జిల్లా ప్రాజెక్ట్ మేనేజరు బి.వెంకటేష్  మాట్లాడుతూ  ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని వివరించారు. బయో రిసోర్స్ సెంటర్ల ద్వారా కషాయాలు తయారు చేసి రైతులకు అందు బాటులో ఉంచడం ద్వారా, ప్రకృతి వ్యవసాయం మరింత సులభతరం అవుతుందని తెలిపారు. రైతులకు అవసరమైన సహజ వ్యవసాయ ఇన్‌పుట్‌లను సమయానికి అందించడం ముఖ్యమని సూచించారు. అదేవిధంగా, ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగు (PMDS) విధానంలో నవధాన్యాలు సాగును విస్తృతంగా ప్రోత్సహించాలని, ప్రతి రైతుకు నవధాన్యాలు విత్తన కిట్లు అందించి అవగాహన పెంపొందించాలని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో ప్రజలకు పెరుగుతున్న ఆరోగ్య సమస్యలుపై వివరించారు. మనం తీసుకునే ఆహారం కలుషితమవడం వల్లే అనేక రకాలు వ్యాధులు వస్తున్నాయని తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు నుండి నేరుగా ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా రైతులకు మద్దతు ఇవ్వడమే కాకుండా, తమ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు rythusampada.in  వెబ్‌సైటులో అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, కేడరు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *