NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోడ్డు ప్రమాదానికి గురైన నవీన్ సాయి ను పరామర్శించిన కాటసాని రామభూపాల్ రెడ్డి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  రోడ్డు ప్రమాదానికి గురై కర్నూలు నగరంలోని  కిమ్స్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న బేతంచర్ల (కాలేజ్) జీ.భూపాల్ రెడ్డి  కుమారుడు నవీన్ సాయి ను పరామర్శించి.. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ల ను అడిగి తెలుసుకోని మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పి,నవీన్ సాయి తోరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అశ్విని హాస్పిటల్ నందు కిడ్నీలో  రాళ్ల సమస్యతో చికిత్స పొందుతున్న కల్లూరు అర్బన్ 31వ వార్డు మాజీ కార్పొరేటర్ మిద్దె చిట్టెమ్మ సోదరుడు పెద్దన్న ను పరామర్శించి,మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు గుండె సంబంధిత సమస్యతో చికిత్స పొందుతున్న కల్లూరు మండలం వామసముద్రం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి కార్యకర్త నారాయణను పరామర్శించి, నారాయణ ప్రస్తుత పరిస్థితిని డాక్టర్ల ను అడిగి తెలుసుకోని, మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, కాటసాని రామభూపాల్ రెడ్డి .

About Author