ఫూలే సేవలు చిరస్మరణీయం
1 min read

విద్యతో నే సమాజ మార్పు సాధ్యం
కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు
సమాజ శ్రేయస్సు కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు జ్యోతి రావు ఫూలే
జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్
బీసీల సమస్యలన్నీ … పరిష్కరిద్దాం
టిడిపి జిల్లా అధ్యక్షురాలు ఆది గుడిసె కృష్ణమ్మ
కర్నూలు , న్యూస్ నేడు : జ్యోతిరావు ఫూలే సేవలు చిరస్మరణీయం , విద్యతోనే సమాజ మార్పు సాధ్యం మని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పూలే జన్మదిన సందర్బంగా పేర్కొన్నారు.శనివారం నగరంలోని జ్యోతి రావు ఫూలే 200వ జయంతి సందర్భంగా బిర్లా గేట్ సర్కిల్లో జ్యోతి రావు ఫూలే విగ్రహానికి కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, పాణ్యం శాసన సభ్యులు గౌరు చరితా రెడ్డి, బి.సి, వివిధ సంఘ నాయకులు పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించి , అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన సభలో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ… సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు ఫూలే సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు. మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్న కాలంలో జన్మించిన ఫూలే గారు వాటి నిర్మూలన కోసం విద్యను ఆయుధంగా ఎంచుకుని సమాజ మార్పుకు కృషి చేశారని ఆయన అన్నారు. భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి ఫూలే గారు నిలిచారని గుర్తుచేస్తూ, మహిళా విద్యకు వారు చేసిన సేవలు అపారమని తెలిపారు. విద్య ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేయడమే కాకుండా, వితంతువులకు ఆశ్రయం కల్పించడం వంటి సంస్కరణాత్మక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ఫూలే ఆశయాలను అందరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. విద్యతోనే వ్యక్తి మరియు సమాజ అభివృద్ధి సాధ్యమని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ విద్యను అభ్యశించాలని కోరారు . బీసీ వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత పెరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ, తనకు ఎంపీగా అవకాశం కల్పించడం జరిగింది. రాబోయే ఏప్రిల్ 16, 17, 18 తేదీలలో పార్లమెంట్ లో మహిళా బిల్లు ఆమోదం పొందుతుంది అన్నారు. రాష్ట్రం లో పార్లమెంట్ స్థానాలు పెరిగే అవకాశముందని, అందులో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పారు. అలాగే శాసనసభ సీట్లు కూడా పెరుగనున్నాయని వెల్లడించారు. ఐక్యతతో ఉంటేనే బిసి సమాజ అభివృద్ధి సాధ్యమని, బీసీల సాధికారత కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని, ఎన్టీ రామారావు ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.వారికి సరియైన విద్య అందించడం , బాల్య వివాహాలను అరికట్టడం మరియు వారి అభివృద్ధికి బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించడం వంటి కార్యక్రమాలకు కృషి చేయాలని సూచించారుజ్యోతిబాపూలే వేషధారుడు అరవింద్ అందరినీ ఆకర్షించాడు.ఈ సమావేశం లో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిని ప్రసూన, బిసి ఈడి జాకిర్ హుస్సేన్ , జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు గుడిసె కృష్ణమ్మ , కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప , బి సి నాయకులు నక్కమిట్టల శ్రీనివాసులు , కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప , బిసి సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మా , డైరెక్టర్ లు కురువ కార్పొరేషన్ పర్ల శ్రీను,వాల్మీకి కార్పొరేషన్ మంజునాథ్,నాయీ కార్పొరేషన్ విజయకుమార్,నాయకులు మురళి,రెడ్డి పోగు రాజకుమార్,రామకృష్ణ,వడ్డెర సంఘం చంద్రిక, శకుంతలమ్మ , ఉల్చాల లక్ష్మీనారాయణ , ధనుంజయ ఆచార్య , బీజేపీ లక్ష్మీకాంతన్న , శాలివాహన సంఘం నాగన్న , మురళి, బాలసంజన్న, వాడాల నాగరాజు, బిసి సంఘం కన్వినర్ నాగేష్ ,శాలివాహన మధు,మొదలగు సంఘాల నాయకులు సభను ఉద్దేశించి పూలే గురించి ప్రసంగించి పాల్గొన్నారు.


