NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాజకీయ కక్షతో నే ..ఇళ్ల పట్టాలు నిలిపేశారు…

1 min read

రీ-సర్వేలో రికార్డులు తారుమారు.. పట్టా భూమి కాస్తా అసైన్డ్ భూమిగా మార్పు

సర్పంచ్, కార్యదర్శి కుమ్మక్కు.. నిబంధనలు తుంగలో తొక్కి సొంత అకౌంట్లకు నిధులు జమ

అధికారుల అండతో భూమి కబ్జా..చంపేస్తామంటూ బెదిరింపులు

గ్రీవెన్స్ లో వైసిపి నేతలపై  ప్రజల ఫిర్యాదు

అర్జీలు స్వీకరించి సమస్యలు పరిష్కరిస్తామని నేతల హామీ

పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ

కర్నూలు, న్యూస్​ నేడు: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం పరమాణు దొడ్డి తాండ గ్రామానికి చెందిన గంగనాయక్ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తమ గ్రామంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినప్పటికీ తమ మూడు కుటుంబాలకు మాత్రం పట్టాలు రాకుండా స్థానిక వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. తాను నిఖార్సైన టిడిపి కార్యకర్తగా ఉండటమే వారు తమకు అన్యాయం చేశారు. జాబితాలో తమ పేర్లు ఉన్నప్పటికీ, కేవలం రాజకీయ కక్షతో తమకు దక్కాల్సిన ఇళ్ల స్థలాలను నిలిపివేసి, మమ్మల్ని ఇబ్బందులకు గురిచేశారు. కావున తమయందు దయవుంచి తమకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని నేతలు పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మలకు అర్జీ ఇచ్చి అభ్యర్ధించారు.కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం పరమాణు దొడ్డి తాండ గ్రామానికి చెందిన గంగనాయక్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. 2001లో దేవి భాయ్ అనే మహిళ గ్రామ ఉమ్మడి దారిని ఆక్రమించి అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నారు. పాత దారులన్నీ వారి ఇంటి స్థలంలో కలిపేసుకున్నప్పటికీ, ఇప్పుడు మళ్లీ తమ స్థలంలో నుండి దారి ఉందని రౌడీయిజం చేస్తున్నారు. దారి లేని చోట దారి ఉన్నట్లుగా కొంతమంది ప్రభుత్వ అధికారులు, వైసీపీ నాయకులతో చేతులు కలిపి తప్పుడు ఎండార్స్‌మెంట్లు, దొంగ మ్యాపులు సృష్టిస్తున్నారు. భూమికి సంబంధించిన పాత పట్టాలను, రికార్డులను పరిశీలించాలని ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, రీ-సర్వే పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం నారిపల్లి గ్రామానికి షేక్ హసన్ పీరా గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. గతంలో వంక పోరంబోకు భూమిని కొనుగోలు చేసి, అందులో పంటలు పండించుకుంటూ తమ కుటుంబం జీవించేది. గత ప్రభుత్వ హయాంలో (2019 నుండి) సరైన ఆదరణ లేక, ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లలు బ్రతుకుదెరువు కోసం చెంగుళూరుకు వలస వెళ్లాల్సి వచ్చింది. గతంలో ఆయిల్ ఇంజన్ ద్వారా సాగు చేసేవారు. ప్రస్తుతం ఆ యంత్రాలు పాడైపోయి, విడిభాగాలు దొరకని స్థితిలో వాటిని అమ్ముకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వంకలో నీళ్లు సమృద్ధిగా ఉన్నా, విద్యుత్ సౌకర్యం లేక పంటలు పండించుకోలేని పరిస్థితి నెలకొంది. ముగ్గురు కొడుకులు ఉన్నప్పటికీ అందరికీ కలిపి ఒకే చిన్న ఇల్లు ఉంది. సొంత భూమి కానీ, కనీసం ఇంటి స్థలం కానీ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. కావున తమయందు దయవుంచి తాము సాగు చేసుకుంటున్న భూమికి పట్టా మంజూరు చేసి దానిని ఆన్లైన్ చేయాలని కోరారు.వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు. స‌మ‌స్యల ప‌రిష్కారానికి త‌గు చ‌ర్యలు తీసుకుంటామ‌ని మంత్రి ధైర్యం చెప్పారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *