NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘మెడిసిన్​ ’లో ఆధునిక చికిత్స పై చర్చ

1 min read

వివిధ ఆరోగ్య అంశాలపై కేంఎంసీ విద్యార్థులకు వివరించిన వైద్య నిపుణులు ​

 కర్నూలు హాస్పిటల్​ , న్యూస్​ నేడు: “కేఎంసిలో జనరల్ మెడిసిన్ జోనల్ సీఎంఇ”.. “మెడిసిన్ విభాగంలో లేటెస్ట్ అప్డేట్స్ పై చర్చ”… కర్నూల్ మెడికల్ కాలేజీ యందు జనరల్ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం జోనల్ స్థాయి సీఎంఇ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రిటైర్డ్ ఎడియంఇ డా. సుధాకర్ హాజరయ్యారు. ఈసీఈమెకి కర్నూల్ నంద్యాల అనంతపూర్ జిల్లాల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల జనరల్ మెడిసిన్ పీజీ విద్యార్థులు హాజరయ్యారు. ఈ సదస్సులో సాధారణ రోగాలు, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, మెటబాలిక్ డిస్ ఫంక్షన్, క్యాన్సర్ చికిత్స మొదలగు వివిధ అంశాలపై విస్తృత చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీఎంసీ అబ్జర్వర్, బయో కెమిస్ట్రీ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, కర్నూలు మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్, జోనస్ సీఏ ఎమ్ఇ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీరాములు, హాస్పిటల్ డిప్యూటీ సూపర్నెంట్ డాక్టర్ శ్రీ లక్ష్మి, విశ్వ భారతి హాస్పిటల్ జనరల్ మెడిసిన్ విభాగాధిపతి & ప్రొఫెసర్ డాక్టర్ రవి కళాధర్ రెడ్డి ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈసీఎంఈ నందు వివిధ విభాగాల నిపుణులు డా శివ ప్రసాద్, డా. మోహన్ రెడ్డి, డా. సాయి సంపత్ కుమార్, డా. శ్రీనివాసులు, డా.మహేశ్వర్ రెడ్డి,డా. విద్యాసాగర్ తదితరులు హాజరయ్యి వివిధ ముఖ్య  ఆరోగ్య సమస్యల చికిత్సల అప్డేట్స్ పై విద్యార్థులకు వివరించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *