NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వివిఆర్​ టీం ఆధ్వర్యంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

1 min read

– కుంభోత్సవానికి అన్ని సౌకర్యాలు సిద్ధం

హోళగుందన్యూస్ నేడు: హొళగుంద మండలం హెబ్బటం గ్రామంలో జరగనున్న శక్తి సవరమ్మ దేవి మరియు  సుంకలమ్మ దేవి కుంభోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకుని వివిఆర్​ టీం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య మరియు మౌలిక సదుపాయాల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.ఆలూరు టీడీపీ ఇంచార్జ్  వైకుంఠం జ్యోతి  మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ వైకుంఠం శివ ప్రసాద్  ఆదేశాల మేరకు, హొళగుంద మండల సహకార బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి  ఆధ్వర్యంలో గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి.ఈ సందర్భంగా గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, గ్రావెల్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి సౌకర్యం, వీధి లైట్లు వంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేపట్టబడుతున్నాయి. కార్యక్రమానికి విచ్చేసే భక్తులకు మరియు గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.ఈ కార్యక్రమంలో ఆలూరు వ్యవసాయ కమిటీ డైరెక్టర్ గోపాల్, యూనిట్ ఇంచార్జ్ సవారప్ప, క్లస్టర్ ఇంచార్జ్ మల్లికార్జున, బూత్ ఇంచార్జ్ శేక్షవాలి, గ్రామ అధ్యక్షులు పాటయ్య, ఉపాధ్యక్షులు నాగయ్య, సభ్యులు శేఖర్, మాణిక్య, కాళప్ప, కృష్ణ, శీను తదితరులు పాల్గొన్నారు.

About Author