పుల్లయ్య కాలేజిలో..మెగా రక్తదాన శిబిరం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు : కర్నూలు మండలం వెంకయ్య పల్లెలోని జి. పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కాలేజి ఎన్ఎస్ఎస్ యూనిట్ మరియు విజ్ఞాన సేవా సమితి, కర్నూల్ వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బి.ఎస్. ప్రవీణ్ కుమార్ (కార్డియాలజిస్ట్) మరియు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి. శ్రీనివాసరావు విచ్చేశారు. కార్యక్రమంలో 48 విద్యార్థులకు పైగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన విద్యార్థులతో ముఖ్యఅతిథి డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ అన్ని దానాల కంటే రక్తదానం గొప్పది అని తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. తాను రోజు నిర్వహించే ఆపరేషన్‌కు రక్తం ఎంత అవసరమో తెలియజేసి ఇలా విద్యార్థులు రక్తదానం చేయడం వల్ల సమాజంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నారన్నారు. కార్యక్రమం విద్యార్థి వ్యవహారాల డీన్ జి. శశి కుమార్, ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారి ఎస్. శంకర ప్రసాద్ నేతృత్వంలో జరిగింది.

