NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వాడ వాడల డా:బి.ఆర్  అంబేద్కర్ విగ్రహాలకు ఘన  నివాళులు

1 min read

పలు డివిజన్ లలో అన్నదానo, చలివేంద్రలు ఏర్పాటు కార్యక్రమాలు

నియోజకవర్గ ఇన్చార్జ్ మామిళ్ళపల్లి జయప్రకాష్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 వ జయంతి సందర్భంగా  ఏలూరు నగర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు ఇనుపనూరి జగదీష్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించడం అయినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి మామిళ్ళపల్లి జయప్రకాష్ (జె పి)పాల్గొని భారతరత్న డా: బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించి, వారు చేసిన సేవలను స్మరించుకున్నారు.అనంతరం 4వ డివిజన్  కార్పొరేటర్ డింపుల్ జాబ్ ఆహ్వానం మేరకు వెన్నవల్లి వారి పేట అంబేద్కర్ పార్క్ లోనిఅంబేద్కర్ విగ్రహం నకు పూల మాలలతో నివాళులు అర్పించారు.వంగాయ గూడెం డా అంబేద్కర్ యువజన సంఘం వారి ఆహ్వానం మేరకు భారత రత్న డా:బి.ఆర్ అంబేద్కర్  జయంతి వేడుకల్లో పాల్గొని, డా:అంబేద్కర్ యువజన సంఘం వారు ఏర్పాటు చేసిన, లైబ్రరీ, ఫోటో ఎగ్జిబిషన్, తిలకించి అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలతో నివాళులు అర్పించారు.అనంతరం బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో  నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నుకపెయ్యి సుధీర్ బాబు,జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు నేరుసు చిరంజీవి,జిల్లా అధికార ప్రతినిధి జాన్ గురునాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి లంకలపల్లి గణేష్,జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కొల్లిపాక సురేష్ ,నగర యూత్ అధ్యక్షులు గంటా సాయి ప్రదీప్,జుజ్జువరపు విజయనగరం, ఇనపనూరి కేదారేశ్వరి, డింపుల్ జాబ్, జి. బాలా త్రిపుర సుందరి, జిల్లా కార్యదర్శి యుగంధర్ ప్రసాద్, జిల్లా ఆర్టీఐ  విభాగ  అధ్యక్షులు స్టాలిన్, విక్టర్, మేతల సురేష్ , పార్వతి, కుమారి, కొత్తపల్లి రాణి, శ్యామ్, కొప్పల్ ఆంజనేయులు, బల్ల రమేష్ , గంట రాజేశ్వర్ రావు, జేవియర్ మాస్టర్, రూబీన, ఎక్కల నాని,స్థానిక పెద్దలు, పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు,పాల్గొని కార్యక్రమలు విజయవంతం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *