NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు ఆదిత్య డిగ్రీ కళాశాలలో డా:బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

1 min read

సమాజంలో బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని మెలగాలి

 కళాశాల ప్రిన్సిపాల్ వంగా వెంకటేశ్వరరావు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు సత్రంపాడు లోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యం లో డాక్టర్:బి.ఆర్ అంబేద్కర్ జయంతి (135 వ జయంతి) ను ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ వంగ వెంకటేశ్వర రావు మరియు. ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మరియు సెట్ వెల్ సి ఈ ఓకె సూర్య ప్రభాకర్ ముఖ్య అతిథిగా గోల్గొన్నారు.కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ అంబేద్కర్ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు.అనంతరం సెట్ వెల్ సిఈ ఓకె సూర్య ప్రభాకర్  అంబేద్కర్ జీవిత విశేషాలు, రాజ్యంగా నిర్మాణంలో ఆయన చేసిన కృషి సమాజ అభివృద్ధి అయిన చూపిన మార్గం గురించి ప్రసంగించారు విద్యార్థులు కూడా ప్రసంగాల ద్వారా అంబేద్కర్ ఆలోచనలను ప్రతిబింబిచారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్  మాట్లాడుతూ విద్యార్థులు అంబేద్కర్ నిస్పర్తి నీ ఆదర్శంగా తీసుకొని సమాజంలో ముందుండాలని సూచించారు.ఈ కార్యక్రమానికి వైస్ ప్రిన్సిపాల్ ఫణి కుమార్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కె.హరిబాబు మరియు బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *