గృహగణన సర్వే పకడ్బందీ గా నిర్వహించండి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: బుధవారం జనగణన సర్వేను పకడ్బందీగా నిర్వహించడం ద్వారా ఖచ్చితమైన సమాచారం సేకరణ సాధ్యమవుతుందని, అదే ప్రభుత్వ ప్రణాళికలకు పునాది అవుతుందని నగరపాలక అదనపు కమిషనర్, సిటి సెన్సస్ ఆఫీసర్ ఆర్జివి, డిప్యూటీ కమిషనర్, చార్జ్ ఆఫీసర్ సతీష్ కుమార్ రెడ్డి అన్నారు. భారతదేశ జనాభా గణన–2027 కార్యక్రమంలో భాగంగా నగరంలో నిర్వహించనున్న ఇంటిగణన ప్రక్రియపై ఎన్యూమరేట్లు, సూపర్వైజర్లు, వీఆర్వోలు, సచివాలయ సిబ్బందికి ఇందిరాగాంధీ మెమోరియల్ మున్సిపల్ స్కూల్, దామోదరం సంజీవయ్య మెమోరియల్ మున్సిపల్ స్కూల్, డాక్టర్ పి.జె. అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ స్కూల్లలో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇంటిగణనలో ప్రతి వివరాన్ని నిశితంగా నమోదు చేయడం అత్యంత ముఖ్యమని, సమగ్ర డేటా ఆధారంగా ప్రజలకు అవసరమైన సేవలు, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయవచ్చని తెలిపారు. నగరంలో మొత్తం 490 మంది ఎన్యూమరేట్లు, 79 మంది సూపర్వైజర్లు, 28 మంది ఫీల్డ్ ట్రైనర్లకు ఇద్దరు మాస్టర్ ట్రైనర్లు శిక్షణ అందిస్తున్నారని వివరించారు. ఈ నెల 15 నుండి 17 వరకు మొదటి బ్యాచ్, 21 నుండి 23 వరకు రెండో బ్యాచ్‌కు ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. జనగణన ప్రక్రియలో ప్రతి సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించి, సమగ్ర సమాచార సేకరణలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. అనంతరం అందరిచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సెన్సస్ ఇంచార్జీ ఎస్.ఇశ్రాయోలు, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, హెడ్ మాస్టర్ రెడ్డిపోగు విజయనిర్మల, తదితరులు పాల్గొన్నారు.

