NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మద్దికేర వద్ద హంద్రీనీవా పై మినీ రిజర్వాయర్ నిర్మించాలి

1 min read

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు డి రాజా సాహెబ్ డిమాండ్

న్యూస్ నేడు,, పత్తికొండ: మద్దికేర మండలంలో మినీ రిజర్వాయర్ ఏర్పాటుచేసి, హంద్రీనీవా ప్రధాన కాలం నుండి నీళ్లు నింపి మండలంలో ప్రతి ఎకరాకు నీళ్లు అందివ్వాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు డి రాజా సాహెబ్ మండల కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మద్దికేర మండల  సమితి ఆధ్వర్యంలో బుధవారం రోజు బస్టాండ్ ఆదరణలో రైతులతో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ మండల కార్యదర్శి నాగరాజు అధ్యక్షన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు డి రాజా సాహెబ్ పాల్గొని మాట్లాడుతూ, కర్నూలు జిల్లాలోని అత్యంత వెనకబడిన ప్రాంతమైన మద్దికేర మండలం దశాబ్దాల నుండి అభివృద్ధికి నోచుకోక ఎలాంటి ఆర్థిక వనరులు లేని మండలం కేవలం పంట భూములు వర్షాలు మీద ఆధారపడి మరియు సుదీర్ఘ ప్రాంతాలకు వలసలు పోయి మండల ప్రజలు జీవనం సాధిస్తున్నారని అన్నారు. ప్రతి సంవత్సరం ఖరీఫ్. రబీలో అరకొర  వర్షాలు పడితే భూములలో విత్తనం వేయడం వర్షాల కోసం ఆకాశము వైపు చూడడం వర్షాలు పడకపోతే విత్తనాల ఎరువులు సాగు చేసిన ఖర్చులతో రైతుకు భారంగా మారి సాగుకు తెచ్చిన అప్పులకు వడ్డీ  కట్టలేక ఆత్మహత్తులు చేసుకుంటున్న పరిస్థితిలు  ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.   ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ ప్రజా సంఘాల నాయకులు కోదండరాముడు, బుజ్జన్న గోపాలు రామాంజనేయులు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *