NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జలధార పనుల గుర్తింపు – అంచనాల సిద్ధం  ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి

1 min read

దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్

ఏలూరు, స్యూస్​ నేడు:  దెందులూరు ఎంపీడీవో కార్యాలయంలో సాగు నీటి సంఘాల చైర్మన్లు,సభ్యులు, ప్రత్యేక అధికారులు,ఇరిగేషన్ సహా వివిధ శాఖల అధికారులు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.అంచనాలు త్వరగా సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడడమే లక్ష్యమని ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ అన్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార’-నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో భాగంగా దెందులూరు నియోజకవర్గంలో చేపట్టాల్సిన పనులపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దెందులూరు ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో కలిసి కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నీటి సంఘాల చైర్మన్లు, సభ్యులు మరియు వివిధ శాఖల అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.అంచనాల తయారీపై ఆదేశంనియోజకవర్గ పరిధిలోని చెరువులు కాలువలు,డ్రైన్ల పూడికతీత మరియు మరమ్మత్తు పనులకు సంబంధించి అంచనాలను (Estimates) యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేయాలని ఎమ్మెల్యే  అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో నీటి సంఘాల చైర్మన్లు, సభ్యులతో సమన్వయం చేసుకుని, ఎక్కడెక్కడ అత్యవసరంగా పనులు చేపట్టాలో గుర్తించి నివేదికలు అందజేయాలన్నారు.ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ”జలధార కార్యక్రమం ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే పూడికతీత పనులు పూర్తి చేయడం వల్ల శివారు భూములకు కూడా సాగునీరు సజావుగా అందుతుందని పేర్కొన్నారు. దెందులూరు నియోజకవర్గంలో బ్రిటిష్ కాలం నుంచి ఉన్న అనేక చెరువులతో పాటు ఇతర చెరువులను కాలువలను పూడికతీతతో పాటు మరమ్మత్తులు చేపట్టడం ద్వారా ప్రతి వర్షపు నీటి చుక్కను ఓడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు దోహదపడుతుందని, అదేవిధంగా ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.. పనుల నాణ్యతలో రాజీ పడకూడదని, నిధుల వినియోగంలో పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు.పనుల మంజూరులో కానీ, అంచనాల తయారీలో కానీ అధికారులు ఉదాసీనత వహించకూడదని ఎమ్మెల్యే  హెచ్చరించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా నీటి సంఘాల ప్రతినిధులు చురుగ్గా పాల్గొని పనులను పర్యవేక్షించాలని సూచించారు.ఈ సమావేశంలో దెందులూరు మండల తహసిల్దార్ బత్తిన సుమతి, దెందులూరు సొసైటీ చైర్మన్ గారపాటి కొండయ్య చౌదరి, తెలుగు యువత అధ్యక్షులు మోతుకూరి నాని,   ఎంపీడీవో ప్రతాప్, కూటమి నాయకులు తిలక్ సహా వివిధ నీటి సంఘాల చైర్మన్లు సభ్యులు వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *