జనగణనపై అధికారులకు శిక్షణ
1 min read

మే ఒకటి నుండి ఇండ్ల వివరాల సేకరణ
మిడుతూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో 2027 కు సంబంధించిన జనగణనపై అధికారులకు శిక్షణ ఇస్తున్నారు.మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణ గురువారం రెండో రోజు ఫీల్డ్ ట్రైనర్లు ఎం జైలానీ, వేణుగోపాల్ జనగణనపై కుటుంబ సభ్యుల వివరాలు ఏవిధంగా సేకరించాలనే వాటి గురించి ఎల్ఈడి స్క్రీన్ ద్వారా శిక్షణ ఇచ్చారు.మే ఒకటి నుండి మే 31 వరకు అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలను సేకరించాలన్నారు.ఈ శిక్షణలో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి క్షేత్రస్థాయిలో పరిశీలన యాప్ లో ఇచ్చిన ఇస్తున్నట్లు ట్రైనర్లు తెలిపారు.మీరు ఇండ్ల వద్దకు వెళ్ళినప్పుడు కుటుంబ స్థితిగతులు మరియు కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు ఇంటి సభ్యులను అడిగి సేకరించాలన్నారు.ఈ వివరాల సేకరణలో కుటుంబానికి సంబంధించిన వివరాలు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తగా సేకరించాలని ట్రైనర్లు అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మండల జనాభా అధికారి తహసిల్దార్ శ్రీనివాసులు, డిప్యూటీ తహసిల్దార్ శాన్వాజ్,టెక్నికల్ అసిస్టెంట్ ఏఎస్ఓ దేవదాస్ మరియు సచివాలయ సిబ్బంది,వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

