ఇoటర్ ఫలితాల్లో ఎన్ ఆర్ ఐ విజయ కేతనం
1 min read

ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన కళాశాలల చైర్మన్ ఆలపాటి రవీంద్ర,సెక్రటరీ అండ్ కరస్పాండెంట్
ఆలపాటి రాజేంద్రప్రసాద్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఇంటర్మీడియట్ ఫలితాల్లో స్థానిక ఎన్నారై విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని యన్ ఆర్ ఐ విద్యాసంస్థల సీఈవో వి. తులసీరామ్ తెలిపారు. జూనియర్ ఇంటర్మీడియట్ లో ఎంపీసీ గ్రూపులో తమ విద్యార్థులు 466, 465, 465, మార్కులు. బైపీసీలో 451, 450 చొప్పున ముగ్గురు. ఎంఈసి గ్రూపులో 491 మార్కులు సీఈసీ గ్రూపులో 491 మార్కులు సాధించారని వివరించారు. సీనియర్ ఇంటర్లో ఎంపీసీలో 990 బైపీసీలో 991, ఎంఈసిలో 972 సిఇసిలో 912 మార్కులు సాధించారని తెలిపారు. మొత్తం 52 మంది విద్యార్థులు ఎంపీసీలో 460 పైబడి 36 మంది విద్యార్థులు బైపీసీలో 970 పైబడి మార్కులు సాధించారని చెప్పారు. కళాశాలలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను కళాశాలల చైర్మన్ ఆలపాటి రవీంద్ర, సెక్రటరీ అండ్ కస్పాండెంట్ ఆలపాటి రాజేంద్రప్రసాద్, డైరెక్టర్లు చుండు సాయిబాబా, బుచ్చయ్య చౌదరి అభినందించారని తెలిపారు. ప్రిన్సిపల్స్ ఇ.కనకరత్నం కె. ప్రభాకర్ రావు, ఎస్ సత్యనారాయణ, టీవీ సురేష్ , సిహెచ్ శశి కుమార్, సిహెచ్ ఎన్ వి.సత్యనారాయణ,ఇ.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

