NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ ఇంటర్ ‘ లో  ‘ వెలాసిటీ ‘ విద్యార్థుల హవా…

1 min read

కళాశాల ఆరంభం నుండి అదే సంచలనం… అద్వితీయ ఫలితాల ప్రభంజనం

నంద్యాల ఎడ్యుకేషన్, న్యూస్ నేడు : నంద్యాల పట్టణంలో   స్థానిక పద్మావతి నగర్ లోని   వెలాసిటీ జూనియర్ కళాశాల విద్యార్థులు బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో సంచలన మార్కులు సాధించారని కళాశాల కరస్పాండెంట్ కే శ్రీనివాసరావు తెలియజేశారు. గురువారం ఏర్పాటు చేసిన అభినందన సభలో కరెస్పాండెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ కళాశాల ఆరంభం నుండి విద్యార్థులు  అద్భుత ఫలితాలను సాధిస్తూ  ప్రతిష్టాత్మకమైన ఐఐటి  కళాశాలలో సీట్లు , అలాగే  బోర్డ్ ఎగ్జామ్స్ లో అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నారని  సంతోషాన్ని వ్యక్తం చేశారు. 2026 జనవరిలో నిర్వహించిన JEE మెయిన్స్  ఫలితాల్లో కళాశాల విద్యార్థిని   M.మనీషా 99.23 పర్సంటైల్ సాధించి  టాపర్  గా నిలిచారని,  అలాగే K తనీష్ 96.54 పర్సంటైల్ సాధించి జాతీయస్థాయిలో వెలాసిటి ఖ్యాతిని నిలిపారు.ప్రిన్సిపల్ & అకడమిక్ హెడ్  మాధవీ లత మాట్లాడుతూ జూనియర్ ఎంపీసీ విభాగంలో  K.తేజశ్రీ – 464 మార్కులు , B. శ్రావణి 463 మార్కులు, P. భార్గవి 463 మార్కులు, S. రియాజుద్దీన్ 463 మార్కులు, D. చాంద్ భాషా 460 మార్కులు, J. భవిత 460 మార్కులు, P. జ్యోతిక 460 మార్కులు తో పాటు  ప్రతి నలుగురిలో ఒకరు 400 పైగా మార్కులు సాధించారు. జూనియర్ బైపీసీ విభాగంలో  M. ప్రియదర్శిని 442 మార్కుల తో పాటు   అత్యధికంగా 75 మంది జూనియర్ విద్యార్థులు 400 పైగా మార్కులు సాధించడం  చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.సీనియర్ ఎంపీసీ విభాగంలో B.సంజన 986 మార్కులు , N. యశస్వి 982 మార్కులు, K. రోహిత్ కుమార్ 981 మార్కులు, M. గౌరి 980 మార్కులతో పాటు ప్రతి ముగ్గురిలో ఒకరు 900 పైగా మార్కులు  సాధించారని తెలియజేశారు.అలాగే సీనియర్ బైపీసీ విభాగంలో S.సమర ఫాతిమా 979 మార్కులు,  S. సమీరా సమ్రీన్  978 మార్కులు,  S. రేష్మ 978 మార్కులు తో పాటు  73 మంది సీనియర్ విద్యార్థులు 900 పైగా మార్కులు సాధించి కళాశాల ప్రతిభను రాష్ట్ర స్థాయిలో ఇనుమడింప చేశారని తెలియజేశారు.అనంతరం .. పరీక్షలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించారు. ఇంతటి  ఘన విజయాన్ని  సాధించడానికి  కృషి చేసిన అధ్యాపక  బృందాన్ని అభినందించారు . ఈ అభినందన సభలో కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author