క్రీడలతో ఉజ్వల భవిష్యత్ : డా. శంకర్ శర్మ
1 min read
కర్నూలు స్పోర్ట్స్ , న్యూస్ నేడు: కొత్త క్రీడల్లో రాణిస్తే త్వరగా గుర్తింపు వస్తుందని డాక్టర్. శంకర్ శర్మ అన్నారు. కర్నూలు అవుట్ డోర్ స్టేడియంలో మోడరన్ పెంటాథ్లాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి లేజర్ రన్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిధిగా ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ, జిల్లా క్రీడల అభివృద్ది అధికారి భూపతిరావు పాల్గొని పోటీలు ప్రారంభించారు. ఈసందర్భంగా డాక్టర్. శంకర్ శర్మ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ మోడరన్ పెంటాథ్లాన్ అంటే ఒకే వ్యక్తి 5 వేర్వేరు క్రీడల్లో పోటీ పడే ఒలింపిక్ క్రీడ అన్నారు. మోడరన్ పెంటాథ్లాన్ లో ఐదు గేమ్ లు ఉంటాయని ఒకేసారి వాటిని ఆడాలన్నారు. ఫెన్సింగ్, స్విమ్మింగ్, ఈక్వెస్ట్రియన్ షో జంపింగ్, పిస్టల్ షూటింగ్, క్రాస్ కంట్రీ రన్నింగ్ ఉంటాయన్నారు. ఇందులో ప్రావీణ్యం సాధించితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు త్వరగా వస్తుందన్నారు. ఈకార్యక్రమంలో అవినాష్, భూపతిరావు, నాగరత్నమయ్య తదితరులు పాల్గొన్నారు.


