ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం
1 min read

వైసీపీ ముస్లీం మైనార్టీ నాయకులు దౌలత్ భాష..
న్యూస్ నేడు నందికొట్కూరు: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్-6 వాగ్దానాలను కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని నందికొట్కూరు వైసీపీ ముస్లిం మైనారిటీ నాయకులు ఎస్.దౌలత్ భాష అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో శుక్రవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ టిడిపి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో రంజాన్ తోఫా,ఉచిత సిలిండర్లు, మహిళలకు ప్రతినెలా 1500 రూ.లు,తదితర పథకాలు ఇస్తామని చెప్పి అమలు చేయలేదన్నారు.నూతన పింఛన్ల కోసం పేద ప్రజలు ఎదురుచూస్తున్నారని వస్తున్న వికలాంగుల పింఛన్లను సాకులతో పింఛన్లను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గత వైసిపి ప్రభుత్వ పథకాలను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగించడం దారుణమని అన్నారు.మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఎన్నికలను ఆరు నెలల పాటు వాయిదా వేశారనిరానున్న మున్సిపాలిటీ మరియు పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని దౌలత్ భాష అన్నారు.

