NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కసాపురంలో ఘనంగా నెట్టికంటి ఆంజనేయ స్వామి రథోత్సవం

1 min read

ఎమ్మెల్యే బుసినే వీరపాక్షి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు

 భారీగా తరలివచ్చిన భక్తజనం – ఉత్సాహభరితంగా రథోత్సవం

గుంతకల్ నియోజకవర్గం – కసాపురం గ్రామం  

ఆలూరు న్యూస్ నేడు : గుంతకల్ నియోజకవర్గంలోని కసాపురం గ్రామంలో ప్రసిద్ధి చెందిన నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి రథోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుసినే వీరపాక్షి కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే  సతీమణి బుసినే రామాంజనమ్మ, కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు మరియు అనేక మంది భక్తులు పాల్గొన్నారు. స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని వారు కోరుకున్నారు.రథోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. భక్తులు భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగుతూ స్వామి సేవలో పాల్గొన్నారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్థానిక అధికారులు, నిర్వాహకులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు.

About Author