NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తూర్పుగోదావరి జిల్లా దళిత సేన కార్యకర్తల సమావేశం

1 min read

సమావేశంలోసంక్షేమపెన్షన్లువెంటనేవిడుదల చేయాలి

దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జుజ్జువరపు రవి ప్రకాష్ డిమాండ్

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : సంక్షేమ పెన్షన్లు వెంటనే విడుదల చేయాలని దళిత సేన సోమవారం సాయంత్రం 4 గంటలకు తూర్పుగోదావరి జిల్లా దళిత సేన కార్యకర్తల సమావేశం నల్లజర్ల మండలం ఆవపాడు గ్రామంలోజరిగింది. ఈ సమావేశంలో దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జువరపు రవి ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అర్హులైన వృద్ధులకు, విడోలకు, వికలాంగులకు, డప్పు కళాకారులకు, చెప్పులు కుట్టే చర్మకారులకు  సంక్షేమ పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని  రవి ప్రకాష్ డిమాండ్ చేశారు అదేవిధంగా రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యవసరదారులు కు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు వారి యొక్క జీవన ఆధారాన్ని మెరుగుపరచుటకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు  వెంటనే సంక్షేమ పెన్షన్లు విడుదల చేయుటకు చొరవ తీసుకోవాలని రవి ప్రకాష్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా జగజ్జీవన్ రామ్ చర్మకారుల కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు దొండపాటి సువర్ణ రాజు అదే విధంగా నల్లజర్ల మండల ఇంచార్జ్ కునుపాము దేవదాసు ఊటూరు మండల ఇంచార్జ్ సెనగల అప్పారావు ప్రధాన కార్యదర్శి కృష్ణ మొదలగు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author