NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కౌతాళం లో తెలుగుదేశం పార్టీ హ్యాట్రిక్ విజయం..!

1 min read

కౌతాళం,  న్యూస్ నేడు : మండల కేంద్రమైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. కౌతాళం ప్రజల ఆశీస్సులతో, ఆదరణతో ఈ విజయం దక్కిందని అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు.గెలుపొందిన అభ్యర్థులు:ఎంపీటీసీ – 1 : సులేకేరి లక్ష్మి

 ఎంపీటీసీ – 2 : స్వామి దాస్

,ఎంపీటీసీ – 3 : ఎస్. లింగేష్,ఈ సందర్భంగా గెలుపొందిన అభ్యర్థులను కౌతాళం ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు.గెలిచిన అభ్యర్థులు మాట్లాడుతూ… “మాపై నమ్మకం ఉంచి భారీ మెజారిటీతో గెలిపించిన కౌతాళం ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రజాసేవలో ఎప్పుడూ ముందు ఉంటాం. గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తాం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం” అని తెలిపారు.ప్రజల ఆశీస్సులతో ఈ విజయాన్ని సాధించిన అభ్యర్థులకు, వారి భవిష్యత్తు ప్రజాసేవ మరింత ముందుకు సాగాలని, గ్రామాభివృద్ధికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *