ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ ఎస్ఎస్ వాలంటీర్ల శ్రమదానం
1 min read
కళాశాల ఆవరణలో రహదారులు, ఆటస్థలం చదును.. మొక్కల సంరక్షణకు చర్యలు
ప్యాపిలి న్యూస్ నేడు: ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్యాపిలిలో ఎన్ ఎస్ఎస్ వాలంటీర్లు శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ఆవరణలోని మరుగుదొడ్లకు వెళ్లే మార్గం ఎగుడుదిగుడుగా ఉండటంతో కంకర, మట్టి వేసి చదును చేశారు. అదేవిధంగా మొక్కలకు పాదులు తీసి వాటి సంరక్షణకు చర్యలు చేపట్టారు. కళాశాల ఆవరణలోని ఆటస్థలాన్ని సైతం చదును చేసి వినియోగానికి అనుకూలంగా తీర్చిదిద్దారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం మాట్లాడుతూ. ఎన్ ఎస్ఎస్ కార్యక్రమాల్లో శ్రమదానం ఒక ముఖ్యమైన భాగమని అన్నారు. శ్రమదానం చేయడం వల్ల విద్యార్థులకు శారీరక ఆరోగ్యంతో పాటు సేవాభావం, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానం అలవడతాయని తెలిపారు. విద్యార్థుల సమిష్టి కృషితో కళాశాలలోని సౌకర్యాలను మెరుగుపరచుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. శ్రమదానంలో చురుకుగా పాల్గొన్న ఎన్ ఎస్ఎస్ వాలంటీర్లను ప్రిన్సిపాల్ అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ నవీన్ పాటి, అధ్యాపకులు శంకరయ్య, మురళీమోహన్ గౌడ్, వెంకటరమణ, ముస్తాక్, వెంకటేశ్వర్లు, మద్దిలేటి, మంజునాథ్, వన్నూర్ తదితరులతో పాటు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు శరణ్, హరికృష్ణ, అశోక్, కౌశిక్, బాలాజీ, హర్షవర్ధన్, రంగా, రాకేష్, చరణ్, కిషోర్, పవన్ రామ్, రవితేజ, వెంకటేష్, వేణుగోపాల్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



