NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్రీన్ దీపావళి – పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ప్రజలందరూ ఈ దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో పాటు పర్యావరణ హితంగా జరుపుకోవాలని, కాలుష్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని   ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రీజినల్ కార్యాలయం ఆధ్వర్యంలో నైస్ కంప్యూటర్స్ కార్యాలయంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో  నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు  లయన్స్ డిస్టిక్ చైర్ పర్సన్  లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. దీపావళి సందర్భంగా అధిక శబ్దం, పొగను వెదజల్లే బాణసంచాను నివారించి, పర్యావరణానికి హాని కలిగించని విధంగా గ్రీన్ దీపావళిని  జరుపుకోవాలని సూచించారు. దీపాలు, మట్టి ప్రమిదలు వెలిగిస్తూ, విద్యుత్‌ను పొదుపు చేస్తూ, పర్యావరణ పరిరక్షణపై పిల్లలకు అవగాహన కల్పించాలని కోరారు. బాణసంచా కాల్చడం వల్ల వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం పెరగడంతో పాటు చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, జంతువులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అసిస్టెంట్ ఇంజనీర్లు రామకృష్ణ  తదితరులు మాట్లాడుతూ అందరూ పర్యావరణ హితమైన దీపావళిని జరుపుకుంటూ ఆరోగ్యకరమైన, సురక్షితమైన, కాలుష్య రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దీపావళి వెలుగులు పంచాలి కానీ కాలుష్యాన్ని కాదు – గ్రీన్ దీపావళి, సేవ్ దీపావళి మనందరి బాధ్యత అన్నారు. అనంతరం విద్యార్థులకు మట్టి ప్రమిదలను  పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఉచితంగా  పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ కుమార్ కెవిఆర్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.  కార్యక్రమానికి ముందు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్ లో జరిగిన  పర్యావరణ పోటీలలో విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరరెడ్డి   తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *