NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అర్ధరాత్రి వేళైనా.. ఆత్మీయ స్వాగతం!

1 min read

హోళగుందలో ఈడిగ గోవింద్ గౌడ్‌కు ఘన స్వాగతం.. భారీ ర్యాలీతో అభిమానం చాటుకున్న గ్రామ ప్రజలు

ప్రజల ఆదరణకు భావోద్వేగానికి గురైన ఈడిగ గోవింద్ గౌడ్

మీ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయను.. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటా

ప్రజల ప్రేమాభిమానాలకు జీవితాంతం రుణపడి ఉంటానని వెల్లడి

హోళగుంద న్యూస్ నేడు: అర్ధరాత్రి వేళైనా అభిమానం ముందు సమయం అడ్డుకాదని హోళగుంద గ్రామ ప్రజలు నిరూపించారు. ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండల జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన ఈడిగ గోవింద్ గౌడ్‌కు గ్రామంలో ప్రజలు అపూర్వమైన ఆత్మీయ స్వాగతం పలికారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో హోళగుంద గ్రామానికి చేరుకున్న ఆయనకు స్వాగతం పలికేందుకు గ్రామ ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఎన్నికల్లో 1,571 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన ఈడిగ గోవింద్ గౌడ్‌కు గ్రామంలో లభించిన ఈ స్వాగతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అర్ధరాత్రి సమయం అయినప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఉత్సాహంగా సాగిన స్వాగత కార్యక్రమం, ప్రజల నినాదాలు, పూలమాలలతో హోళగుంద గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా ప్రజలు చూపించిన అపారమైన ప్రేమాభిమానాలు, ఆత్మీయతకు ఈడిగ గోవింద్ గౌడ్ భావోద్వేగానికి గురయ్యారు. తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరినీ పేరుపేరునా గుర్తుంచుకుంటానని, ప్రజలు తనపై ఉంచిన నమ్మకం తనకు ఎంతో బాధ్యతను పెంచిందని తెలిపారు.

ఈ సందర్భంగా ఈడిగ గోవింద్ గౌడ్ మాట్లాడుతూ…

“నాపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానం, ఆదరణ మాటల్లో చెప్పలేనిది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కూడా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి నాకు ఘన స్వాగతం పలకడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. మీ అందరి అభిమానానికి, ఆదరణకు జీవితాంతం రుణపడి ఉంటాను. నా గెలుపులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయను. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాను. కులమత, రాజకీయ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటాను. ప్రజలకు ఏ కష్టం వచ్చినా మీకు అండగా నిలబడతాను. మీ ప్రేమే నా బలం, మీ అభిమానం నా బాధ్యత. ఎల్లప్పుడూ మీలో ఒకడిగా ఉంటూ హోళగుంద మండల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను” అని హృదయపూర్వకంగా తెలియజేశారు.ఎన్నికల విజయానంతరం అర్ధరాత్రి వేళ కూడా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం పలకడం ఈడిగ గోవింద్ గౌడ్‌పై వారికున్న అభిమానాన్ని ప్రతిబింబించింది. ఈ కార్యక్రమంలో అభిమానులు, మద్దతుదారులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రజల ప్రేమే నా బలం… మీ అభిమానం ఎప్పటికీ నా బాధ్యత!

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *