లక్ష్య సాధన దిశగా అడుగులు వేయండి
1 min read
మార్కులే కొలమానం కాదు…
- విద్యార్థులకు సూచించిన ప్రముఖ సైకియాట్రిక్ వైద్యులు డా. రమేష్ బాబు
కర్నూలు, న్యూస్ నేడు : విద్యార్థులు మానసికంగా ధైర్యంగా ఉండాలని సూచించిన ప్రముఖ సైకియాట్రిక్ వైద్యులు డా. రమేష్ బాబు… మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ప్రపంచ స్కిజోఫ్రెనియా దినోత్సవం సందర్భంగా ఆదివారం నగరంలోని బుధవార పేట బ్రాంచ్ కేశవ మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఆరోగ్య భారతి మరియు అభ్యాస వర్ణ కార్యక్రమం జరిగింది. ఆరోగ్య భారతి (ఆంధ్ర, తెలంగాణ & కర్ణాటక) అధిపతి కుమారస్వామి , ఏపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డా. మోక్షేశ్వరుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైద్యులు డా. రమేష్ బాబు మాట్లాడుతూ మార్కులు తక్కువగా వచ్చాయని ఆందోళన చెందవద్దని, జీవితంలో విజయం సాధించాలంటే మార్కులు ఒక్కటే కొలమానం కాదన్నారు. ఈ సందర్భంగా మెడికల్ ఆకాంజిస్ట్ ఎండి,డిఎం. డా. శివ కృష్ణ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని, ఆధునిక ప్రపంచంలో క్యాన్సర్ కు చికిత్స సాధ్యమేనన్నారు. మూడు దశల్లో ఉన్న క్యాన్సర్ ను నియంత్రించే అవకాశం ఉందని, కానీ నాల్గవ దశకు చేరితే ప్రాణాలకే ప్రమాదం ఉంటుందన్నారు. ఆ తరువాత ప్రముఖ సైకియాట్రిక్ వైద్యులు డా. రమేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి సారించాలన్నారు. మానసిక రుగ్మతలు, లక్షణాలు, చికిత్స, నివారణ తదితర అంశాల గురించి డా. రమేష్ బాబు క్షుణ్ణంగా వివరించారు.



