NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోడ్ల కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి

1 min read

హొళగుంద న్యూస్ నేడు : అద్వానంగా వున్న ఆలూరు నుంచి ఎల్లార్తి గ్రామానికి పోవు రోడ్డును మరియు ఆలూరు నియోజకవర్గానికి సంబంధించిన అన్ని రోడ్ల పనులను బాగు చేపించాలనీ కోరుతూ జిల్లా కలెక్టర్ శ్రీ అట్టా సిరి కి వినతిపత్రాన్ని అందించిన బిసివై పార్టీ కర్నూలు జిల్లా ఇన్చార్జి ఎల్లార్తి అర్జున్ వాల్మీకి.కలెక్టర్  స్పందిస్తూ వెంటనే ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని పంచాయత్ రాజ్ ఎస్​ఈ ను ఆదేశాలను ఇవ్వడం జరిగింది.అర్ధాంతరంగా నిలిపివేసిన రోడ్లను  కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుని నిలబడి పోయిన రోడ్ల పనులను పునః ప్రారంభించడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలను జారి చేసి ప్రయాణికుల మరియు వాహనదారులు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి జిల్లా కలెక్టర్ కృషి చేయాలని  కర్నూలు జిల్లా కలెక్టర్ ని కోరడం జరిగింది.  ఆలూరు నియోజకవర్గ పరిధిలోని వున్న ఎల్లార్తి గ్రామంలో వెలసిన హజరత్ షాషా శెక్షావలి దర్గాలకు వేల సంఖ్యలో భక్తులు ప్రతీరోజూ వచ్చి వెళుతుంటారు. ఆలూరు నుంచి ఎల్లార్తి గ్రామానికి వాహనాలు రావడానికి చాలా ఇబ్బందులు పడుతూ అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా మన ఆలూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలకు వెళ్ళే ప్రతీ రోడ్ల పరిస్థితి ఇదే విధంగా వున్నాయి.సుమారుగా ఒక సంవత్సరం క్రితం రోడ్ల మరమ్మతులు చేయడానికి ప్రారంభించిన పనులను ఇంతవరకై పూర్తి చేయకుండా కాంట్రాక్టర్లు అర్ధాంతరంగా పనులను ఆపి కాలయాపన చేస్తున్నారు. కావున జిల్లా కలెక్టర్  వీటిపై ప్రత్యేక దృష్టి సారించి ఆగి పోయిన రోడ్లను తిరిగి పనులను ప్రారంభించి దిన నిత్యం ప్రయాణం చేస్తున్నటుంవంటి ప్రయాణికులకు మరియు దర్గాలకు వచ్చే భక్తులకు అద్వానంగా వున్న ఈ రోడ్ల నుంచి విముక్తి కలిగించాలనీ ఆలూరు నియోజకవర్గ ప్రజల తరుపున మరియు ఎల్లార్తి గ్రామానికి వచ్చే భక్తుల ద్వారా జిల్లా కలెక్టర్ ని విన్నవించుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎల్లార్తి గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ మతి సునీత ఆమె భర్త బోయ తిమ్మప్ప పాల్గొన్నారు.

About Author