వైఎస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్న 30 కుటుంబాలు
1 min read

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆలూరులో టీడీపీకి బిగ్ షాక్హాలహర్వి మండలానికి చెందిన కమ్మ సామాజికవర్గం నుంచి 30 కుటుంబాలు వైఎస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు.చిప్పగిరి మండలం కాంగ్రెస్ పార్టీ నుంచి 15 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి చేరడం జరిగింది చిప్పగిరి మండలం కాజీపురం గ్రామం నుంచి తెలుగు దేశం పార్టీ నుంచి 20 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి చేరడం జరిగింది.పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఆలూరు వైయస్సార్సిపి ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి చెంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన్నారు. పార్టీలోకి వచ్చిన వారందరికీ నేను రాబోయే రోజుల్లో న్యాయం చేస్తానని మీకు హామీ ఇస్తున్న అని తెలియజేశారు. ఆలూరు వైయస్సార్సిపి ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గం కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు,వైస్ ఎంపీపీ లు ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్ అభిమానులు పాల్గొన్నారు.


