NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హొళగుంద మండలంలో ఉపాధ్యాయుల కొరత తీర్చండి

1 min read

డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులను హొళగుందకు నియమించండి డీఈఓ శామ్యూల్ పాల్ ను కోరిన బహుజన టైమ్స్ ఎండి దుర్గాప్రసాద్

హొళగుంద న్యూస్ నేడు :  హొళగుంద మండల పరిధిలోని ప్రాథమిక ప్రాథమికోన్నత మరియు జిల్లా పరిషత్ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులను కొత్తగా ఎంపికైన డీఎస్సీ ఉపాధ్యాయులతో భర్తీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ను బహుజన టైమ్స్ ఎండి దుర్గాప్రసాద్ కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారిని కలిసి మారుమూల హెూళగుంద మండలంలో రోడ్డు సరిగా లేదనే కారణంతో సీనియర్ ఉపాధ్యాయులు చాలా వరకు పనిచేయడానికి ఇష్టపడడం లేదని గతంలో జరిగిన బదిలీలలో ఉపాధ్యాయులు వెళ్లిపోవడమే తప్ప కొత్తగా వచ్చిన వారు తక్కువగా ఉన్నారని అందువల్ల మండలంలోని గ్రామాలలో ఉన్న ప్రాథమిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలతో పాటు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ఇతర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చాలావరకు ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యార్థులకు సరైన విద్య అందడం లేదని తెలియజేశారు. డీఎస్సీ ఉత్తీర్ణత సాధించిన వారితో పూర్తిస్థాయిలో ఖాళీలను భర్తీ చేసి ఉపాధ్యాయులు నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అలేఖ్య విజయ్ కుమార్, హెల్త్ చంద్రశేఖర్, గ్రామపంచాయతీ సిబ్బంది అరుణ్ కుమార్, వరాల శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

About Author