NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అక్షర స్వీకార మహోత్సవం

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిరంలో  అక్షర స్వీకార మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం బ్రాహ్మణులు ఎస్కెట్ లో పని చేస్తున్న స్వామి చిన్నారులు 62 మందికి అక్షరాభ్యాసం చేయించారు. మొదట వినాయకుని పూజ తో ప్రారంభించి యజ్ఞ కార్యక్రమం నిర్వహించి అనంతరం  యజ్ఞం లో ముగ్గురు దంపతులు కూర్చున్నారు. హరిత దంపతులు, శేషు దంపతులు, మౌలాలి దంపతులు వీరి చేత యజ్ఞం చేశారు. తరువాత 62 మంది చిన్నారులకు స్వామి వారు అక్షరాభ్యాసం చేయించారు. తరువాత తీర్థ ప్రసాదాలు అందజేశారు. వచ్చిన పోషకులు అందరూ నర్సరీ రూమ్ లో ఉన్న అలంకరణ చూసి వెళ్లారు. ఈ కార్యక్రమంనకు ప్రభంధకారిణి సభ్యులు వై. పార్థసారథి, చిన్నారులు, ఆచార్యులు,పోషకులు పాల్గొన్నారు.

About Author