డా. ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగులకు అన్ని వైద్య సేవలు ఉచితంగా చేయాలి
1 min read

డిడిసి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగులకు అన్ని వైద్య సేవలు ఉచితంగా ఇవ్వాలనిజిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా వైద్యాధికారులకు సూచించారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా కలెక్టరేట్లోని తమ ఛాంబర్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ స్కీం కింద వైద్యాధికారులతో డిడిసి(జిల్లా డిసిఫ్లైనరీ కమిటీ) సమావేశం నిర్వహించారు.సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం వైద్య అభివృద్ధికి అధిక నిధులు ఖర్చు చేయడం జరుగుతుందని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగులకు అన్ని వైద్య సేవలు ఉచితంగా ఇవ్వాలన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో ఐవిఆర్ ఎస్, మెడికల్ ఆడిట్ కేసులకు సంబంధించి రివ్యూ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 12 కేసులకు సంబంధించి ఆసుపత్రుల ద్వారా అమౌంట్ రోగులకు ఇప్పించడం జరిగింది.ఇకనుంచి ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగుల నుంచి ఎలాంటి డబ్బులు వసూలు చేయరాదని అన్ని వైద్య సేవలు ఉచితంగా ఇవ్వాలన్నారు. అలా చేయని యెడల పదింతల వరకు అపరాధ రుసు విధించడం తోపాటు ఆసుపత్రి లైసెన్సు రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.ఇందులో ముఖ్యంగా కన్సల్టేషన్ చార్జీలు, ఇన్వెస్టిగేషన్ కు, ఎమర్జెన్సీ సేవలు పూర్తి ఉచితంగా అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ, డిసిహెచ్ఎస్ డాక్టర్ ఓ.లలిత, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ వై.రూపేంద్ర నాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

