అంగన్ వాడీల రిలే నిరాహార దీక్షలు
1 min read

ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా దీక్షలు:సీఐటీయూ
నందికొట్కూరు, న్యూస్ నేడు: అంగన్వాడీ కార్యకర్తలకు జీతాలు పెంచడంలో ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనకు గాను కార్యకర్తలతో నిరాహార దీక్షలు చేపట్టినట్లు సిఐటియు నాయకులు తెలిపారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏసురత్నం అన్నారు. సోమవారం అంగన్వాడి వర్కర్స్ స్థానిక ప్రాజెక్టు ఆఫీసు ముందు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి పట్టణ కార్యదర్శి గోపాలకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వం వచ్చి 20 నెలలై మూడు బడ్జెట్లు ప్రవేశ పెట్టినప్పటికీ అంగన్వాడీలకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడలేదన్నారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు 42 రోజులు సమ్మె చేసినప్పుడు సమ్మెకు మద్దతుగా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు,ఎమ్మెల్యేలు తమ వద్దకు వచ్చి నిలిచారని అధికారంలోకి వచ్చినా వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని వెంటనే వేతనాలు పెంచుతామని హామీని గుర్తు చేశారు.ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని 23 నుండి 25 తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు..26,27 కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళనలు చేపడతామని అప్పటికీ స్పందించకపోతే మార్చి 2 న విజయవాడలో మహాధర్నా ఉంటుందని హెచ్చరించారు.అంగన్వాడీ కార్యకర్తలు దీక్షల్లో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు మధార్ బి, పద్మావతమ్మ,మల్లేశ్వరి, రమణ బాయ్,బాలిశ్వరి మరియు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పక్కిర్ సాహెబ్,బెస్తరాజు పాల్గొన్నారు.

