ఎస్ డబ్ల్యూ ఎస్ స్కూల్ కు తాగునీటి సౌకర్యం..
1 min read

కౌతాళం న్యూస్ నేడు: కౌతల మండల కేంద్రంలోని ఎస్ డబ్ల్యూ ఎస్ పాఠశాలలో తాగు నీటి సమస్యను సర్పంచ్ పాల్ దినకర్ పరిష్కరించారు. సోమవారం పేరెంట్స్ మీటింగ్లో హెడ్ మాస్టర్ ఎంఈఓ సూచనలతో స్పందించి పంచాయతీ సెక్రెటరీ సహకారంతో వాటర్ ట్యాంక్ నుంచి నేరుగా స్కూల్ పంపుకు పైపులు ఏర్పాటు చేశారు దాదాపు 300 నుంచి 400 మంది విద్యార్థులు తాగునీటి సమస్య తీరింది అన్నారు. హెచ్ఎం మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

