NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి బీసీలు సిద్ధంగా ఉండాలి 

1 min read

ఓబిసి జిల్లా చైర్మన్ డివి సాంబశివుడు.     

కర్నూలు, న్యూస్​ నేడు:  వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలు పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ డివి సాంబశివుడు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఓబీసీ నియోజకవర్గాల చైర్మన్ ల సమావేశంలో సాంబశివుడు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో బీసీలు ఎక్కువగా ఉన్నారని బీసీలలో ఎందరో నిరుపేదలు ఉన్నారని బీసీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని ఎన్నికలలో ఆ పార్టీలు బీసీలను కరివేపాకుల వాడుకొని వదిలేస్తున్నారని ఏపీలో 140 కి పైగా బీసీ కులాలు ఉన్నాయని కనుక బీసీలు తప్పక వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని బీసీలు అందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందామని రాహుల్ గాంధీ ని ప్రధాని చేయడమే మన ధ్యేయమని సాంబశివుడు  తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ కో ఆర్డినేటర్ దేవిశెట్టి ప్రకాష్, ఐ ఎన్ టి యు సి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఖాద్రి పాషా, జిల్లా మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్, కేకేసి జిల్లా చైర్మన్, డిసిసి మాజీ ఉపాధ్యక్షుడు షేక్ రియాజుద్దీన్, కాంగ్రెస్ నాయకులు షేక్ మాలిక్ భాష, బస్తిపాడు దస్తగిరి, డాక్టర్ వెంకప్ప, ఆనందరాజు, రహీం భాష నియోజక వర్గాల ఓబీసీ చైర్మన్లు మొదలగువారు పాల్గొన్నారు.

About Author