నూజివీడు రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీలు
1 min read

వార్షిక తనిఖీలు చేసిన ఏలూరు రేంజ్ డిఐజి (ఐజి)
పోలీస్ సిబ్బంది గౌరవ వందనం
టెక్నాలజీ సహాయాన్ని సమర్థవంతంగా వినియోగించినందుకు ప్రశంసలు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు రేంజ్ ఐజీ జివిజి అశోక్ కుమార్ ఐపీఎస్ వారు నూజివీడు రూరల్ సర్కిల్ ఆఫీస్ ను వార్షిక తనిఖీ లలో భాగము గా తనిఖీ నిర్వహించినారు.ఏలూరు రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) జి.వి.జి. అశోక్ కుమార్ ఐపీఎస్ శనివారం నాడు ఏలూరు జిల్లా లోని నూజివీడు రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీ నిర్వహించినారు.ముందుగా ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఐపీఎస్ కి పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు.అనంతరం వారు సర్కిల్ పరిధి లోని సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఇప్పటి వరకు నూజివీడు రూరల్ సర్కిల్ పరిధిలో నమోదు చేసిన కేసులలో దర్యాప్తు లో ఉన్న కేసుల్లో దర్యాప్తు ను త్వరితగతిన పూర్తి చేయుట కొరకు తగిన సూచనలు మరియు ఆదేశాలు ఇచ్చినారు.కోర్టు మానిటరింగ్ విభాగాలు చేస్తున్న కృషిని మెచ్చుకుంటూ, కేసులలో శిక్షలు పడిన రేటు పెరగడం వ్యవస్థ యొక్క పటిష్టతకు నిదర్శనమని తెలిపారు. ఈ ప్రక్రియను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.ఏలూరు రేంజ్ ఐజి తో పాటుగా ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ ప్రతాప్ శివ కిషోర్ నూజివీడు డిఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ సత్య శ్రీనివాస్ టౌన్ ఇన్స్పెక్టర్,కె రామకృష్ణ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నూజివీడు,ఆగిరిపల్లి, ముసునూరు మరియు చాట్రాయి పోలీస్ స్టేషన్ల ఎస్సైలు. సిబ్బంది పాల్గొన్నారు.


