NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభించిన శ్రీమతి వైకుంఠం

1 min read

ఆలూరు న్యూస్ నేడు:  హాలహర్వి మండల కేంద్రం లో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభించిన శ్రీమతి వైకుంఠం శ్రీ భక్త కనకదాసు 538 జయంతి శ్రీ నారా చంద్రబాబు నాయుడు  రాష్ట్ర పండుగగా నిర్వహించడం సందర్భంగా హాలహర్వి మండల కేంద్రంలో మరియు నిట్రావట్టి  గ్రామంలో  శ్రీ భక్త కనకదాసు  విగ్రహం పూజ చేసి నిట్రావట్టి  గ్రామంలో   శ్రీ భక్త కనకదాసు జయంతి ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి   వైకుంఠం జ్యోతి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. తక్కువ కులం నుండి వచ్చాడని బ్రాహ్మణ పూజారులు కనకదాసుకు శ్రీ కృష్ణ దర్శనానికి అనుమతి నిరాకరించారు. కనకదాసు గుడి బయట కూర్చుని భక్తి పారవశ్యంతో శ్రీకృష్ణ కీర్తనలు గానం చేస్తూ ఉండేవాడు. ఒకానొకరోజు దేవాలయం గోడ పడి పోయి, స్వామి విగ్రహం కనకదాసు ఉన్న వైపుకు తిరిగింది. ఈ కారణంగానే ఉడిపి దేవాలయం తూర్పు ముఖంగా ఉన్నప్పటికీ, శ్రీకృష్ణ విగ్రహం మాత్రం పడమర ముఖంగా ఉంటుంది.ఇంతటి గొప్ప భక్తుడు కనకదాసు సమాజంలో ఉన్నత, నిమ్న, కుల, ఓట్లు అనే సంకుచితత్వాన్ని తొలగించి భక్తిమార్గం ద్వారా సంఘ సంస్కరణను తీసుకొచ్చిన దార్శనికుడు, దశశ్రేష్ఠుడు కురువ, కురుమ,కురుబ కులాల ఆరాధ్య దైవం శ్రీ కనకదాసు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author