NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేంద్రీయ విద్యాలయం మదనపల్లిలో అడ్మిషన్స్ కు అప్లికేషన్స్ జారీ ప్రారంభం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: కేంద్రీయ విద్యాలయం మదనపల్లి నందు 2026-27 విద్యా సంవత్సరమునకు గాను అడ్మిషన్లు ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపల్ టీ. వెంకటేశ్వర్లు ఒక ప్రకటన లో తెలిపారు. 20.03.2026 న కలెక్టర్ సమక్షంలో జాయినింగ్ రిపోర్టును అందజేశారు. తరగతుల ప్రారంభించడానికి అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల (బాలురు ) మదనపల్లి ఆవరణలో గల తాత్కాలిక భవనం నందు ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు ప్రారంభిస్తు న్నట్లు తెలిపారు. ఒకటో తరగతి అడ్మిషన్స్ మార్చ్ 20వ తేదీ నుండి వచ్చే ఏప్రిల్ రెండవ తేదీ వరకు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలని కోరారు. రెండవ తరగతి నుండి 5వ తరగతికి మాత్రము దరఖాస్తులు విద్యాలయ కార్యాలయం నందు జారీ చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవలసిందిగా కోరడమైనది. అడ్మిషన్స్ కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకే కాకుండా ఇతరులకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని న ప్రిన్సిపల్ కాంటాక్ట్ నెంబర్ 9441473837 కు సంప్రదించవలసినదిగా కోరడమైనది. అడ్మిషన్ గైడ్లైన్స్ మరియు ఇతర వివరాలకై www.kvsangathan.nic.in దర్శించగలరు. మొదటి తరగతి కి అప్లై చేసుకునే వారు 3 https://admission.kvs.gov.in/చేసుకోగలరు. మొదటి తరగతిలో దరఖాస్తు చేసుకోవడానికి వయసు 31 మార్చి 2026 నాటికి ఆరు సంవత్సరాల పైబడిన వారు అర్హులని తెలిపారు. అడ్మిషన్స్ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ గైడ్లైన్స్ ప్రకారము జారీ చేయబడును.

About Author