NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేకాట స్థావరంపై దాడి ..

1 min read

5 మంది అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 9,360 నగదును నగదు స్వాధీనం

పెదవేగి సీఐ సిహెచ్.రాజశేఖర్

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు

ఏలూరుజిల్లా ప్రతినిధి  న్యూస్​ నేడు   : జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ నూజివీడు డిఎస్పి  కె.వి వి ఎన్ వి ప్రసాద్  ఆదేశాల మేరకు, అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించేందుకు చేపట్టిన చర్యల భాగంగా, పెదవేగి సీఐ  సిహెచ్. రాజశేఖర్ కి రాబడిన సమాచారం పై పోలీసులు పెదవేగి మండలంలోని న్యాంపల్లి గ్రామములో పేకాట స్థావరంపై అకస్మాత్తుగా దాడి నిర్వహించారు.ఈ దాడిలో 5 మంది పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి మొత్తం రూ. 9,300 నగదును స్వాధీనం చేసుకొని సదరు   సంఘటనపై పెదవేగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినారు. ఈ సందర్భంగా పెదవేగి ఇన్స్పెక్టర్ సిహెచ్. రాజశేఖర్ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలు నివారణ కొరకు మారుమూల ప్రాంతాల్లో  డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు, పేకాట కోడిపందాలు ప్రజల జీవితాలపై దుష్ఫలితాలు కలిగిస్తాయి అని, మద్యం అక్రమ రవాణా వంటి కార్యకలాపాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు. ఎవరు ఈ తరహా చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడినా, వారిపై కఠిన చర్యలు తప్పవు. గ్రామీణ ప్రజలు తమ భవిష్యత్తును నాశనం చేసే ఇటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలి అని, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించే వారి యొక్క సమాచారాన్ని డయల్ 112 ఈ కు గాని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలని సమాచారం అందించిన వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా పెదవేగి ఇన్స్పెక్టర్ తెలియ చేసినారు.

About Author