కొమ్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు
1 min read

మానవతా మూర్తి కొమ్మారెడ్డి రాంబాబు అని పలువురు ప్రశంసలు
తాత ముత్తాతల నుంచి పోతునూరు గ్రామానికి అండగా నిలుస్తున్నారు
సేవా దృక్పథంతో పలువురికి ఆదర్శం
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : కొమ్మారెడ్డి సేవాగుణం ఎంతో అభినందనీయం అని, వారి తాత ముత్తాతల నుంచి వస్తున్న సేవ గుణాన్ని ఆదర్శంగా తీసుకుని సాటి మనుషులకు సాయం చేయటం కోసం,పోతునూరు గ్రామ అభివృద్ధి కోసం ఎల్లప్పుడు ముందు ఉండే నిగర్వి, మానవతా మూర్తి కొమ్మారెడ్డి రాంబాబు అని, వారి సేవలను స్పూర్తిగా తీసుకుని మరెంతో మంది ప్రముఖులు ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమంలో భాగం అయ్యి సమాజ ప్రగతికి దోహదపడాలని కోరుతున్నాను అని, అదే విధంగా దెందులూరు మండలం లోని పోతునూరు గ్రామం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న గ్రామమని ఈ గ్రామం నుంచి పలువురు మంత్రులుగా ప్రజాప్రతినిధులుగా ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని,గత వైసిపి ప్రభుత్వం లో ఎన్ని వేధింపులు పెట్టినా కూడా వాటిని తట్టుకొని ఎదిరించి నిజాయితీ వైపు నిలబడిన స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి కూడా పోతునూరు గ్రామానికి చెందిన వారే అవడం ఎంతో గర్వకారణం అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.దెందులూరు మండలం పోతునూరు గ్రామంలో కొమ్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కీ.శే.కొమ్మారెడ్డి సదాశివరావు జ్ఞాపకార్థం వారి కుమారుడు కొమ్మారెడ్డి రాంబాబు ఆర్థిక సహకారంతో రూ.50 లక్షల రూపాయలను వెచ్చించి పోతునూరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నిర్మించిన అదనపు భవనం (మల్టీపర్పస్ హాల్) మరియు జిల్లా పరిషత్ హై స్కూల్ లోని సైకిల్ స్టాండ్, సహా నూతనంగా ఏర్పాటు చేసిన పలు మౌలిక సదుపాయాలను కార్యక్రమ విశిష్ట అతిథి, స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి తో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా కార్యక్రమా విశిష్ట అతిథి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి మాట్లాడుతూ “పోతునూరు గ్రామ అభివృద్ధిలో కొమ్మారెడ్డి వారి ముద్ర ఎప్పుడూ ఉంటుంది అని ఏ అంశం ఉన్నా కూడా దానికి అండగా ఉంటామంటూ తమ తాత ముత్తాతల నుంచి కూడా పోతునూరు గ్రామానికి తమ కుమార్ రెడ్డి కుటుంబం అన్ని విధాల అండగా నిలుస్తుందని రాబోయే రోజుల్లో కూడా అన్ని అండగా ఉంటామని కొమ్మారెడ్డి పట్టాభి తెలిపారు. పోతునూరు లోని స్థానిక చెరువు ప్రక్షాళనకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుభ్రత కార్యక్రమం చేపడతామని తెలిపారు. తమకు పోతునూరు గ్రామం తో ఉన్న బంధం ఎప్పటికీ తగ్గిపోదు అని, అదే విధంగా తాము ఎంతగానో అభిమానించే ఎమ్మెల్యే దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని ,దెందులూరు నియోజకవర్గఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, పలు కార్పొరేషన్ లో డైరెక్టర్లు అధికారులు, సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.


