NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి.ఆర్ గవాయి  పైన దాడి అనాగరిక చర్య

1 min read

హొళగుంద న్యూస్ నేడు:  పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు హొళగుంద మండలంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కెంచప్ప మాట్లాడుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి.ఆర్ గవాయి  పైన దాడి అనాగరికమైన చర్య అని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కెంచప్ప మాదిగ ఆరోపించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి దళితుడు కావడం వల్లే ఈ దాడి జరిగింద నీ పేర్కొన్నారు.ఈ దాడి చేసిన వారి మీద చట్టపరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.జరిగిన దాడి మీద చీఫ్ జస్టిస్ గవాయి గారి స్పందన అత్యంత హుందాతనంతో ఉందన్నారు. ఎమ్మార్పీ సీనియర్ నాయకుడు కన్నారావు  మాట్లాడుతూ దళితులు ఉన్నత స్థానాల్లో కూర్చోవడం కొంతమందికి గిట్టడం లేదు అందుకే ఈ దాడికి తెగ పడుతున్నారు ఇది కేవలం చీఫ్ జస్టిస్ పై దాడి మాత్రమే కాదు దేశ న్యాయవ్యవస్థ మీద ప్రజాస్వామిక స్ఫూర్తి మీద అన్నిటికన్నా ప్రధానంగా రాజ్యాంగ మీద జరిగిన దాడిగా అభివర్ణించారు. ఎమ్మార్పీఎస్ ఆలూరు తాలూకు కో- ఇంచార్జి మల్లికార్జున మాట్లాడుతూ రాజ్యాంగం వల్లనే ఈ దేశంలోని దళిత వర్గాలు స్వేచ్ఛ స్వాతంత్రం గౌరవం గుర్తింపును  సంపాదించుకున్నాయని పేర్కొన్నారు.  అందువల్ల భగవద్గీత బైబిల్ ఖురాన్ కన్నా రాజ్యాంగమే మాకు ముఖ్యం అన్నారు.అయితే  దేశ ప్రజలందరూ ఖండిస్తున్న చీఫ్ జస్టిస్ పై దాడి ఘటనలో  కేసు నమోదు చేయడంలో  నిర్లక్ష్యం చేయవద్దు అని పేర్కొన్నారు.వాయిఖర్జూరహో విష్ణుమూర్తి విగ్రహ విషయంలో చేసిన వ్యాఖ్యల మీద వివరణ ఇచ్చినప్పటికీ కూడా కావాలనే దాడి చేయడం జరిగింద న్నారు .కానీ బిఆర్​ గవాయ్  దళితుడు కావడం వల్ల దళితులు కనీసం నోరు విప్పే స్వేచ్ఛ కూడా లేదని వైఖరితో అహంకారపూరిత  దాడి చేశారన్నారు.ఈ దాడిని దేశం మొత్తం ఖండిస్తుంది  కాబట్టి నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తగిన చర్యలు చేపట్టాలి అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు హెబ్బటం పకీరప్ప, గోవర్ధన్, వెంకటేష్, పల్లి ఈరన్న, కల్లప్ప, రమేష్, కెంచప్ప, ఆంజనయ్య, తిమ్మ, శేషగిరి, దాసప్ప, వెంకటేష్ నగేష్, వీరేష్, సాయి బేస్, దేవేంద్ర, తప్పట మల్లి, భూషణం,  వీరేషలక్ష్మీకాంత, (జర్జీ) హనుమంతు, రాజు దేవప్ప, అంబన్న, అంజిని, హనుమప్ప, ముని, బసలింగ, యల్లప్ప, యేసప్ప, ఆనంద, గోపాల్, బాలు, ఉలేష్ మాదిగలు తదితరులు పాల్గొన్నారు .

About Author