NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హిందువులపై దాడులు చేస్తే సహించేది లేదు

1 min read

విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు..

నందికొట్కూరు, న్యూస్​ నేడు: హిందువులపై దాడులు చేస్తే సహించే ప్రసక్తే లేదని విశ్వ హిందూ పరిషత్ నంద్యాల జిల్లా అధ్యక్షులు బుగ్గన చంద్రమౌళీశ్వర రెడ్డి అన్నారు. గురువారం నందికొట్కూరులో శివ స్వాములపై జరిగిన దాడిని ఖండిస్తూ హిందువులు భారీ ర్యాలీ చేశారు.దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలనిఅనుమతులు లేని చర్చిలను తొలగించాలంటూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ర్యాలీ చేస్తూ దాడిని ఖండిస్తూ నిరసన తెలిపారు.పట్టణంలోని కొత్త బస్టాండ్ నుంచి పటేల్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి కేజీ రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు.తర్వాత మున్సిపాలిటీ కమిషనర్ వెంకటరామిరెడ్డికి మరియు డిప్యూటీ తహసిల్దార్ సోమేశ్వరికి వినతిపత్రం అందజేశారు.జిల్లా నలుమూలల నుంచి భారీగా హిందువులు తరలి వచ్చారు.దాడులు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ  హిందువులు నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ప్రతాప్ రెడ్డి,కిషోర్ కుమార్,రామయ్య నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *