NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైద్యుల నైతిక విలువల అవగాహన సదస్సు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  వైద్యుల నైతిక విలువల అవగాహన సదస్సులో పాల్గొన్న అడిషనల్ D.M.E మరియు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రి సూపరిండెంట్ డా.కే .వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైద్య వృత్తి అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, అది ఒక పవిత్రమైన సేవ అని గుర్తుచేశారు. రోగికి, వైద్యుడికి మధ్య ఉండే నమ్మకాన్ని కాపాడటం ప్రతి డాక్టర్ బాధ్యతని, రోగి వివరాలను అత్యంత రహస్యంగా ఉంచడం ప్రాథమిక నైతిక సూత్రమని ఆయన స్పష్టం చేశారు.​వైద్యులు చికిత్స అందించే సమయంలో రోగికి మరియు వారి బంధువులకు వ్యాధి పరిస్థితిని, అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలను స్పష్టంగా వివరించాలి. ఎటువంటి అపోహలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించడం ద్వారా వైద్య వ్యవస్థపై ప్రజల్లో పెరుగుతుందని పేర్కొన్నారు.వైద్య శాస్త్రంలో వస్తున్న మార్పులను నిరంతరం గమనిస్తూ, అధునాతన వైద్య సేవలను పేదలకు సైతం అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. చిట్టినరసమ్మ , ప్రొఫెసర్ మరియు H.O.D డాక్టర్ చింత ప్రభాకర్ రెడ్డి ,  ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

About Author